సాక్షి లైఫ్ : ఢిల్లీ-NCRలో చలి పెరగడంతో, కాలుష్య స్థాయిలు తీవ్రంగా మారాయి. చాలా ప్రాంతాలలో 400 కంటే ఎక్కువ AQIలు నమోదయ్యాయి. ఆనంద్ విహార్, రోహిణి, నోయిడాలో అధ్వాన్నంగా ఉన్నాయి. ఢిల్లీ-NCR తోపాటు అనేక ప్రాంతాలలో వాయు నాణ్యత సూచిక (AQI) 400 పైన నమోదైంది, ఇది "అత్యంత ప్రమాదకరమైన" స్థాయి. అందువల్ల, పిల్లలు, వృద్ధులు,శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్ళేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
జాతీయ రాజధాని ప్రాంతం (NCR) గాలి నాణ్యత (Air Quality) అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) నివేదికల ప్రకారం, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) 'తీవ్రమైన' (Severe) స్థాయికి చేరింది.
ముఖ్యంగా ఆనంద్ విహార్, రోహిణి వంటి ప్రాంతాలలో AQI 430 దాటగా, నోయిడా సెక్టార్-125లో అత్యధికంగా 448గా నమోదైంది. ఈ ప్రాంతాలలో PM2.5 ప్రధాన కాలుష్య కారకంగా ఉంది, ఇది నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం (AQI 418) కూడా 'తీవ్రమైన' కేటగిరీలోనే ఉంది.
పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఢిల్లీలోని IGI విమానాశ్రయం (T3), ఫరీదాబాద్, గురుగ్రామ్ ప్రాంతాలలోనూ AQI 310కి పైగా ఉండి 'చాలా పేలవంగా' (Very Poor) కేటగిరీని సూచిస్తోంది. ఈ పెరిగిన కాలుష్య స్థాయిల కారణంగా శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం వంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.










