Nipah Virus Situation in India : భారత్ లో నిఫా వైరస్ పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
సాక్షి లైఫ్ : పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్ (NiV) మరోసారి పడగ విప్పింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాసత్‌లో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధృవీకరించింది. తొలుత ఐదుగురికి లక్షణాలు ఉన్నట్లు అనుమానించినప్పటికీ, పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి మాత్రమే పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఆసుపత్రి సిబ్బందికి..
బాధిత ఇద్దరూ ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా, మరొకరు కోలుకుంటున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రంగంలోకి దిగిన వైద్య బృందాలు.. బాధితులతో కాంటాక్ట్ అయిన 190 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాయి. అదృష్టవశాత్తూ వారందరికీ నెగటివ్ రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నిఫా.. మూడోసారి..!
పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్ బయటపడటం ఇది మూడోసారి. గతంలో 2001లో సిలిగురిలో, 2007లో నదియా జిల్లాలో ఈ వైరస్ విజృంభించింది. తాజాగా వైరస్ బయటపడటంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మొబైల్ బయో సేఫ్టీ ల్యాబ్ (BSL-3) ద్వారా ఎప్పటికప్పుడు నమూనాలను పరీక్షిస్తున్నారు.
వ్యాప్తి ఎలా..? లక్షణాలేంటి..?
నిపా అనేది జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్. ప్రధానంగా గబ్బిలాలు, పందుల ద్వారా లేదా అవి కొరికిన పండ్ల ద్వారా ఇది వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు నొప్పి. ఇన్ఫెక్షన్ తీవ్రమైతే ఊపిరితిత్తుల సమస్యలు, మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్), ఫిట్స్ రావచ్చు. ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
చికిత్స ఎలా..?
ప్రస్తుతం దీనికి నిర్దిష్టమైన టీకా లేదా మందులు అందుబాటులో లేవు. సకాలంలో అందించే మెరుగైన వైద్యమే (Supportive Care) ప్రాణాలను కాపాడుతుంది. WHO ప్రస్తుతానికి ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపిస్తున్నట్లు ఆధారాలు లేవని, ప్రమాద తీవ్రత తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
