పాప్‌కార్న్ బ్రెయిన్ ఎలాంటి వారికివచ్చే అవకాశం ఉంటుంది..?  

సాక్షి లైఫ్ : పాప్‌కార్న్ బ్రెయిన్ ఈ రోజుల్లో చాలా మందిని ప్రభావితం చేసే ఈ సమస్యలలో ఒకటి. పాప్‌కార్న్ బ్రెయిన్ ఇటీవలి కాలంలో కొత్త పదంగా ఉద్భవించింది. ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం మనస్సులోకి  వచ్చే పరిస్థితిని "పాప్ కార్న్ బ్రెయిన్" అంటారు. దీని కారణంగా ఒత్తిడి, ఆందోళన పెరిగి ఉత్పాదక తగ్గుతుంది. అంతేకాదు ఈ పరిస్థితి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా దెబ్బతీస్తుంది. 

ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ ఉరుకులు, పరుకుల జీవితం. దీంతో ఒత్తిడి పెరిగి అనేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ను ఫాలో అయ్యేవాళ్ళు నిరంతరం స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అంతేకాదు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ ఏమేం పోస్ట్ చేశాడో..? ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయో అన్న ఆలోచనలతో సోషల్ మీడియానే ఒక ప్రపంచంగా భావించి అచంచలమైన ఆలోచనలు కలిగి ఉండడాన్నే " పాప్‌కార్న్ బ్రెయిన్" అంటారు. 

ఇది కూడా చదవండి..  

అసలు ఏంటీ పాప్‌కార్న్ బ్రెయిన్..? 

 పాప్ కార్న్ తయారు చేసేటప్పుడు ఎలాగైతే మొక్కజొన్న గింజలు పేలిపోతూ అటూ, ఇటూ పడుతుంటాయో.. అదేవిధంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ల ఆలోచనలు ఉంటాయని అందుకే వీరి ఆలోచనలకు తగినట్లుగా " పాప్‌కార్న్ బ్రెయిన్" అని పేరు పెట్టారు. 

ఆందోళన పెరిగి ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఏకాగ్రత ఒకదానిపై నిలపలేరు. దేనిమీద సరిగా మనసు నిలపలేక పోవడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. తద్వారా సరిగా నిద్ర పట్టదు. ఈ ప్రభావంతో పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాకు స్మార్ట్ ఫోన్లను పరిమితంగా వాడాలని మానసికశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions social-media social-media-users digital-detox-benefits digital-detox-challenge digital-detox-tips digital-detox-camp social-media-detox digital-detox-phone how-to-do-a-digital-detox mental-clarity-from-digital-detox healthy-habits-for-a-digital-world
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com