షుగర్ పేషెంట్లకు బిగ్ రిలీఫ్..కేవలం 5 నిమిషాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తెలుసుకోవచ్చు..
సాక్షి లైఫ్ : ఐఐటీ గౌహతి పరిశోధకులు ఐదు నిమిషాల్లో ఫాస్ట్ ఫుడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) రిజల్ట్ ను అందించే పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీతో మధుమేహ వ్యాధిగ్రస్తులు మెరుగైన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ పరికరంతో పరీక్షించిన తర్వాత ఆహార పదార్థాలను మూడు ప్రధాన వర్గాలుగా వర్గీకరిస్తారు. వేగంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు (ఆర్డీఎస్), నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు (ఎస్డీఎస్), రెసిస్టెంట్ పిండి పదార్థాలు(ఆర్ఎస్).
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి పరిశోధకులు ఐదు నిమిషాల్లో ఫాస్ట్ ఫుడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)ని చెప్పే పరికరాన్ని అభివృద్ధి చేశారు.జీఐ అనేది ఆహారం తీసుకోవడం ద్వారా మీ షుగర్ స్థాయి ఎంతవరకు పెరుగుతుందో తెలిపే కొలమానం. ఈ సాంకేతికతతో, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారాన్ని మెరుగ్గా నిర్వహించ గలుగుతారు. పోర్టబుల్ గ్లైసెమిక్ ఇండెక్స్ సెన్సార్‌ను కలిగి ఉన్న పరికరాన్ని ప్రొఫెసర్ దీపాంకర్ బందోపాధ్యాయ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ బృందం రూపొందించింది.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే..? ఎలా నిర్వహించాలి..?
జీఐని ఇంట్లోనే పరీక్షించవచ్చు..
జీఐని తనిఖీ చేయడానికి ఏ ప్రయోగశాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. పేషెంట్లు దీన్ని ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు. జీఐఎక్కువగా ఉండే ఆహారం రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. తరువాత వేగంగా పడిపోతుంది. అప్పుడు ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఇది టైప్-2 మధుమేహంను, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనికి విరుద్ధంగా, జీఐ తక్కువగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు.
పరికరం ఎలా పని చేస్తుంది..?
గోల్డ్ నానోపార్టికల్స్, ఆల్ఫా-అమైలేస్ ఎంజైమ్‌లను కలపడం ద్వారా ఒక ప్రత్యేక నానోఎంజైమ్ తయారు అవుతుంది. ఈ నానోఎంజైమ్ పొడవాటి పిండిని మాల్టోస్ అనే సాధారణ చక్కెరగా విడదీస్తుంది. మాల్టోస్ మొత్తం ఎలక్ట్రోకెమికల్‌గా కొలుస్తారు. పరీక్ష కోసం, సెన్సార్ అమర్చిన పరికరంలో ఫాస్ట్ ఫుడ్ నమూనాను ఉంచాలి. గది ఉష్ణోగ్రత వద్ద కేవలం ఐదు నిమిషాల్లో పరీక్ష ప్రక్రియ పూర్తవుతుంది. తద్వారా జీఐఎక్కువగా ఉండే ఆహారం కాకుండా తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు..
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
