Breakthrough Bio-Material Check for Knee Pain: మోకాళ్ల నొప్పులకు ‘బయో మెటీరియల్’ తో చెక్..! కొత్త గుజ్జుతో మళ్లీ చిగురించనున్న కార్టిలేజ్..
సాక్షి లైఫ్ : ఈ మధ్య కాలంలో వయసు పైబడిన వారిని మాత్రమే కాదు.. యువతను సైతం వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ల నొప్పులు. ఒకసారి మోకాళ్లలోని మృదులాస్థి (Cartilage) దెబ్బతింటే అది సహజంగా పునరుత్పత్తి అవ్వడం సాధ్యం కాదు. కానీ, వైద్య రంగంలో జరిగిన ఒక సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు కోట్ల మందికి ఆశలు రేకెత్తిస్తోంది. మృదులాస్థిని తిరిగి పెరిగేలా చేసే ఒక అద్భుతమైన ‘బయోయాక్టివ్’ మెటీరియల్‌ను నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఏమిటీ ‘రబ్బరు గుజ్జు’ (Rubbery Goo)..?
సాధారణంగా మోకాళ్ల కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి ఎముకల మధ్య ఘర్షణను తగ్గించి, మనం నడిచేటప్పుడు షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. ఇది దెబ్బతింటే తీవ్రమైన నొప్పి, వాపు వస్తాయి. శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ కొత్త పదార్థం చూడటానికి రబ్బరు గుజ్జులా ఉంటుంది. దీనిని మోకాళ్లలో ఇంజెక్ట్ చేసినప్పుడు, అది శరీరంలోని కణజాలంతో కలిసిపోయి ఒక 'స్కాల్ఫోల్డ్' అంటే అల్లిక వంటి నిర్మాణంను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణం ఆధారంగా శరీరంలోని కణాలు కొత్త మృదులాస్థిని నిర్మిస్తాయి.
గొర్రెలపై ప్రయోగం సక్సెస్..
ఈ చికిత్సను శాస్త్రవేత్తలు గొర్రెలపై ప్రయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించారు. గొర్రెల మోకాళ్లపై ఉండే బరువు, ఒత్తిడి దాదాపు మనుషుల మోకాళ్ల మాదిరిగానే ఉంటుంది. ఈ పదార్థాన్ని ప్రయోగించిన ఆరు నెలల్లోనే గొర్రెలలో అధిక నాణ్యత కలిగిన మృదులాస్థి తిరిగి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో మన శరీరంలో సహజంగా ఉండే 'హైలురోనిక్ యాసిడ్', ప్రోటీన్ ముక్కలతో ఈ పదార్థాన్ని రూపొందించారు. దీనివల్ల శరీరం దీనిని సులువుగా స్వీకరిస్తుంది.
పాత చికిత్సల కంటే..
ప్రస్తుతం మోకాళ్ల నొప్పులకు అందుబాటులో ఉన్న శస్త్రచికిత్సలు లేదా ‘మైక్రోఫ్రాక్చర్’ పద్ధతుల వల్ల ఏర్పడే మృదులాస్థి అంత గట్టిగా ఉండదు. దీనివల్ల 41 శాతం మందికి భవిష్యత్తులో మోకాళ్ల మార్పిడి (Knee Replacement) తప్పనిసరవుతోంది. కానీ, ఈ కొత్త పద్ధతి ద్వారా పెరిగే కణజాలం చాలా బలంగా, మన్నికగా ఉంటుందని పరిశోధక బృంద నేత శామ్యూల్ ఐ. స్టప్పీ తెలిపారు. మా కొత్త థెరపీ సహజంగా పునరుత్పత్తి చెందని కణజాలాన్ని కూడా తిరిగి పెరిగేలా ప్రేరేపిస్తుంది. ఇది భవిష్యత్తులో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల అవసరాన్ని తగ్గించగలదని పరిశోధకులు శామ్యూల్ ఐ. స్టప్పీ చెబుతున్నారు.
భవిష్యత్తులో..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి పైగా కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఖరీదైన మోకాళ్ల మార్పిడి సర్జరీల అవసరం ఉండదు. క్రీడాకారులు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. వైద్య చరిత్రలో మైలురాయిగా నిలిచే ఈ ‘బయో మెటీరియల్’ త్వరలోనే మానవులపై ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇది విజయవంతమైతే, మోకాళ్ల నొప్పులనేవి గతం కానున్నాయి..!
ఇది కూడా చదవండి..Diabetes or High Blood Pressure : డయాబెటిస్ లేదా బీపీ ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
