అధిక కార్బ్ ఆహారాలు జీవితకాలాన్ని అడ్డుకోగలవు..సరికొత్త పరిశోధన.. 

సాక్షి లైఫ్ : అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు మానవులలో జీవితకాలాన్ని తగ్గిస్తాయని కొత్త అధ్యయనం కనుగొంది. హర్యానాలోని అశోకా యూనివర్సిటీ పరిశోధకులు నుసి పురుగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

 నుసి పురుగులు మానవులకు చాలా జన్యు, భౌతిక సారూప్యతలున్నాయి. మానవులలో వ్యాధికి కారణమయ్యే 75శాతం జన్యువులు ఈ నుసిపురుగులలో కనిపిస్తాయి. అంతేకాదు మానవులలో క్యాన్సర్‌కు కారణమయ్యే 90శాతం జన్యువులను కలిగి ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.  నుసిపురుగులలో అధిక కార్బోహైడ్రేట్ ఆహారం వాటి ఆయుష్షును తగ్గించిందని పరిశోధకులు కనుగొన్నారు.

 అధిక కార్బోహైడ్రేట్ ఆహారం.. 

పునరుత్పత్తి ఉత్పత్తిని ఆలస్యం చేయడమేకాకుండా,  తగ్గిస్తుంది. పీర్-రివ్యూడ్ జర్నల్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఇది పిల్లలు, వృద్ధులకు కూడా హాని కలిగిస్తుంది. ఇది వృద్ధులలో చలనశీలత తగ్గడానికి ,వృద్ధులలో పేగు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

 
ఆహారంలో అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం నివారించడం,తగినంత ప్రోటీన్ సమతుల్య ఆహారం ఉండేలా చూసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను తగ్గించడానికి, దీర్ఘాయువును మెరుగుపరచడానికి కీలకమని అధ్యయనం తెలిపింది.

కేలరీలు..

ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి అనే దానిపై మాత్రమే కాకుండా, జీవక్రియ రుగ్మతలను నివారించడానికి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడానికి మాక్రోన్యూట్రియెంట్ కూర్పుపై కూడా దృష్టి పెట్టాలని అధ్యయనం సూచిస్తుంది.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : research low-carb-diet carbonated-beverages study will-a-low-carb-diet-shorten-your-life low-carbs-shorten-your-lifespan low-carb-diets-will-shorten-your-life-span low-carb-diet-may-be-the-key-to-sustained-weight-loss low-carb-diet-leads-to-increased-mortality low-carb-diets

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com