Rising Disease Burden by 2050 : నిప్పుల కొలిమిలా ఇండియా : 2050 నాటికి పెరగనున్న రోగాల ముప్పు..ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ తాజా అధ్యయనం..!
సాక్షి లైఫ్ : భానుడి భగభగలు కేవలం చెమటకే పరిమితం కావడం లేదు.. మనల్ని శారీరకంగా నిర్వీర్యం చేస్తూ రోగాల బారీన పడేయబోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 2050 నాటికి భారతీయులను మరింత 'సోమరి'గా మార్చనున్నాయని ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ తాజా అధ్యయనం హెచ్చరించింది. బయట తిరగలేని పరిస్థితి వల్ల శారీరక శ్రమ తగ్గి, మధుమేహం, గుండెపోటు వంటి ముప్పులు పొంచి ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
27.8 డిగ్రీలు దాటితే.. అంతే సంగతులు..!
పరిశోధకుల అంచనా ప్రకారం, సగటు ఉష్ణోగ్రత 27.8°C దాటిన ప్రతిసారీ ప్రజలు బయటకు వచ్చి వ్యాయామం చేయడం లేదా నడవడం గణనీయంగా తగ్గిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శారీరక నిష్క్రియాశీలత (Physical Inactivity) 1.5శాతం పెరుగుతుంటే, భారత్ వంటి దేశాల్లో ఇది 1.85శాతం వరకు ఉండవచ్చని అంచనా. 2050 నాటికి మన దేశంలో శారీరక శ్రమ లేని వారి సంఖ్య మరో 2 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది వినడానికి స్వల్పంగా అనిపించినా, కోట్ల మంది ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముంచుకొస్తున్న ముప్పు..?
వ్యాయామం లేకపోవడం వల్ల ఇప్పటికే భారత్ 'మధుమేహ రాజధాని'గా మారుతోంది. వేడి కారణంగా ఇళ్లకే పరిమితమైతే ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ తగ్గితే రక్తపోటు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులు దాడి చేస్తాయి. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. బయట తిరగకపోవడం, వ్యాయామం లేకపోవడంతో డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి.
ఆర్థిక వ్యవస్థకూ నష్టమే..!
ప్రజలు అనారోగ్యం పాలైతే అది కేవలం వ్యక్తిగత సమస్యగా మిగలదు. దేశ ఉత్పాదకత తగ్గి, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. లక్షలాది మంది అకాల మరణం పాలయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పరిష్కారం ఏమిటి అంటే..?
పెరుగుతున్న వేడిని తట్టుకునేలా పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచడం, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేలా మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో వేడి కంటే.. దానివల్ల వచ్చే రోగాలే మనల్ని ఎక్కువగా దెబ్బతీస్తాయని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
