ఇన్సులిన్ లేకుండానే టైప్ 1 డయాబెటిస్‌ కు కొత్త చికిత్స..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న తీవ్రమైన ,దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్-1 ,టైప్-2. ఒక్కసారి మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత దాన్ని జీవితాంతం అదుపులో ఉంచుకోవడానికి పలురకాల మందులు వాడాల్సి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..అనారోగ్య సమస్యలను నివారించడానికి సమతుల్య ఆహారం ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..ఇలాంటి ఐదు రకాల ఆరోగ్యకరమైన అలవాట్లతో ఏరోగం లేకుండా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..ఆహారం విషయంలో ఏది బెటర్ శాఖాహారమా..? మాంసాహారమా..?

టైప్-1 మధుమేహం విషయంలో.. 

టైప్-2 మధుమేహ సమస్యను మందులతో పాటు జీవనశైలి అలవాట్లు, ఆహారపు అలవాట్ల ను మెరుగుపరచడం ద్వారా నియంత్రించవచ్చు, అయితే టైప్-1 మధుమేహం విషయంలో రోగులు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి. పరిశోధకులు ఇప్పుడు టైప్-1 డయాబెటిస్ ను నయం చేసేందు కు అవసరమైన చికిత్స విషయంలో గొప్ప విజయాన్ని సాధించారు. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా టైప్-1 మధుమేహాన్ని నయం చేయవచ్చని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇటీవల 25 ఏళ్ల మహిళకు మధుమేహం సమస్య నయమైంది. ఆమె దశాబ్దానికి పైగా ఈ వ్యాధితో బాధపడుతోంది. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా మహిళకు దాదాపు రెండున్నర నెలల్లో ఈ వ్యాధి నుంచి ఉపశమనం లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు ఆమెకు  ఇన్సులిన్ వాడే అవసరం లేకుండానే సహజంగా తన చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 
 
స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఒక వరం.. 

చైనాలోని ఒక స్థానిక వార్తాపత్రికలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఒక దశాబ్దానికి పైగా టైప్ -1 మధుమేహంతో బాధపడుతున్న ఒక మహిళ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా మార్పిడి తర్వాత మధుమేహం నుంచి ఉపశమనం పొందింది. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి అరగంట మాత్రమే పట్టింది. ఇప్పుడు ఆమె ఇన్సులిన్ తో పని లేకుండానే సహజంగా తన చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయి.

గతేడాది జూన్‌లో.. 
 
గతేడాది జూన్‌లో చైనా పరిశోధకుల బృందం క్లినికల్ రీసెర్చ్‌కు ఆమోదం పొందింది. దీని తర్వాత మొదటి రోగికి స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. చికిత్స తర్వాత, పేషంట్ ఫాస్టింగ్  బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్  క్రమంగా నియంత్రణలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరం లేకుండా పోయింది. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగిన 75 రోజుల తర్వాత, ఆమె ఎలాంటి ఇన్సులిన్ ఇంజెక్షన్లను వాడ్డంలేదని నివేదిక పేర్కొంది. 

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.