WHO Expert Panel Clarifies : టీకాలకు, ఆటిజమ్‌కు ఎలాంటి సంబంధం లేదు: WHO నిపుణుల ప్యానెల్

సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణుల ప్యానెల్ (Expert Panel) కీలకమైన ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌లు (Vaccines) తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (Autism Spectrum Disorders - ASD) వస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని ఈ ప్యానెల్ స్పష్టం చేసింది. పిల్లలకు చిన్న వయసులోనే ఇచ్చే టీకాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం ఉందనే నమ్మకం కొందరిలో బలంగా ఉంది. అయితే, ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ, WHO నిపుణుల బృందం తాజా అధ్యయనాలు, డేటాను సమీక్షించిన అనంతరం, టీకాలకు, ఆటిజమ్‌కు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అనేది మెదడు అభివృద్ధిలో వచ్చే వైవిధ్యం. ఇది సామాజిక సంభాషణలు, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. టీకాల భయం కారణంగా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వేయాల్సిన ముఖ్యమైన టీకాలను ఆలస్యం చేయడం లేదా వేయకపోవడం జరుగుతోంది. దీని వల్ల తట్టు (Measles), పోలియో (Polio) వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, WHO ప్యానెల్ చేసిన ఈ ప్రకటన.. తల్లిదండ్రులకు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకాల భద్రతపై భరోసా కల్పించేందుకు, అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పేందుకు ఉపకరిస్తుంది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : polio-vaccine who autism autism-children autism-kids vaccine asd measles who-guidelines
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com