సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి కారణంగా అతి చిన్న వయసులోనే చాలామంది 'బట్టతల' సమస్యతో సతమతమవుతున్నారు. జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి రకరకాల నూనెలు, రసాయన మందులు వాడి విసిగిపోయిన వారికి పరిశోధకులు ఇప్పుడు ఒక తీపి కబురు అందించారు. కేవలం కొన్ని వారాల్లోనే సహజ సిద్ధంగా తిరిగి జుట్టు మొలిపించే సామర్థ్యం ఉన్న సరికొత్త 'ప్లాంట్ బేస్డ్ సీరమ్'ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తైవాన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఆశలు చిగురింపజేస్తోంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ముఖ్యంగా నేటి యువతలో హెయిర్ ఫాల్ తోపాటు, బాల్డ్ హెడ్ సమస్య మరింతగా పెరుగుతోంది. తైవాన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన సరికొత్త ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రసాయనిక మందుల కంటే సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలతో (Fatty Acids) మెరుగైన ఫలితాలు వచ్చిట్లు వైద్యనిపుణులు గుర్తించారు.
మరి ఇది ఎలా పనిచేస్తుంది..?
సాధారణంగా మన చర్మానికి గాయం అయినప్పుడు, శరీరం సహజంగానే స్పందిస్తుంది. ఆ సమయంలో చర్మం కింద ఉండే కొవ్వు కణాలు (Adipocytes) కొన్ని ప్రత్యేకమైన ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. ఇవి నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్లను (Hair Follicles) మేల్కొల్పుతాయని శాస్త్రవేత్తలు గమనించారు. ఇదే సూత్రాన్ని ఉపయోగించి, ఎటువంటి గాయం లేకుండానే నేరుగా జుట్టు పెంచేందుకు మొక్కల నూనెల్లో ఉండే 'ఒలీయిక్ యాసిడ్', 'పామిటోలియిక్ యాసిడ్' వంటి సహజ మూలకాలతో ఈ సీరమ్‌ను తయారు చేశారు.
పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు..
ఎలుకలపై చేసిన ప్రయోగంలో కేవలం 20 రోజుల్లోనే దట్టమైన జుట్టు పెరగడం గమనించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మినాక్సిడిల్ (Minoxidil) వంటి మందులతో పోలిస్తే, ఈ ప్లాంట్ సీరమ్ వల్ల ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ గానీ, హార్మోన్ల మార్పులు సంభవించలేదని తేలింది. ఈ సీరమ్ జుట్టు మూలాల్లోని స్టెమ్ సెల్స్‌ను చురుగ్గా మార్చడం ద్వారా సహజ పద్ధతిలో జుట్టు పెరిగేలా చేస్తోంది.
నిపుణులు ఏమంటున్నారు అంటే..?
ఇప్పటివరకు జుట్టు రాలడాన్ని అడ్డుకునే మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, సహజ పద్ధతిలో రీ-గ్రోత్‌ను ప్రోత్సహించే ఈ సీరమ్ భవిష్యత్తులో బట్టతలకు శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉంది. అయితే, మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తర్వాతే ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది" అని పరిశోధక బృందం తెలిపింది. ఈ పరిశోధన ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. మార్కెట్లో దొరికే ఏ సీరమ్‌నైనా వాడే ముందు చర్మ వ్యాధి నిపుణులను (Dermatologist) సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com