3D-printed cornea : దేశంలో తొలిసారి 3డీ-ప్రింటెడ్ కార్నియా..! హైదరాబాద్‌ శాస్త్రవేత్తల చారిత్రక విజయం..! 

సాక్షి లైఫ్ : అంధత్వానికి (Blindness) ప్రధాన కారణాల్లో ఒకటైన కార్నియా దెబ్బతినే సమస్యకు (Corneal Damage) త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. దేశంలోనే తొలిసారిగా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పరిశోధకులు 3డీ ప్రింటింగ్ (3D Printing) సాంకేతికతను ఉపయోగించి కృత్రిమ కార్నియాను (Artificial Cornea) విజయవంతంగా రూపొందించారు. కంటి సంరక్షణ రంగంలో ఇది ఒక సంచలనాత్మకమైన, విప్లవాత్మకమైన ఆవిష్కరణ అని వైద్యనిపుణులు కొనియాడుతున్నారు.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

పరిశోధనలో పాలుపంచుకున్న సంస్థలు.. 

ఈ అద్భుతమైన 'మేడ్-ఇన్-ఇండియా' (Made-in-India) ఆవిష్కరణని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ (LVPEI), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (IIT-H), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు.

3డీ-కార్నియా ప్రత్యేకతలు ఏమిటి..?

కార్నియా అనేది కంటి ముందు భాగంలో ఉండే పొర. ఇది కాంతిని కేంద్రీకరించి, స్పష్టమైన దృష్టికి సహాయపడుతుంది. దాతల నుంచి లభించే కార్నియా కొరతను అధిగమించేందుకు ఈ 3డీ ప్రింటెడ్ కార్నియా ఎంతో ఉపయోగపడుతుంది.

మానవ కణజాలంతో..  

ఈ కృత్రిమ కార్నియాను మానవ కణజాలం నుంచి సేకరించిన కార్నియల్ కణజాలం (Human Donor Corneal Tissue) ఉపయోగించి తయారు చేశారు. పూర్తిగా సహజమైనది (Natural).. ఇందులో ఎలాంటి సింథటిక్ (Synthetic) భాగాలు గానీ జంతువుల అవశేషాలు గానీ లేవు. ఈ త్రీడీ ప్రింటెడ్ కార్నియాను అవసరమైన వారికి సురక్షితంగా అమర్చవచ్చు.

చౌకైన పరిష్కారం..  

కార్నియా అపారదర్శకంగా మారడం (Corneal Scarring) లేదా క్రమంగా సన్నబడటం (Keratoconus) వంటి వ్యాధులకు చికిత్స అందించడంలో ఇది చౌకైన, గొప్ప ఆవిష్కరణ అని ప్రధాన పరిశోధకులు డాక్టర్ సయన్ బసు, డాక్టర్ వివేక్ సింగ్ వెల్లడించారు.

కంటిగాయాలకు చికిత్స..  

యుద్ధ సమయంలో కంటికి గాయాలైనప్పుడు, గానీ వైద్య సదుపాయాలు సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో కార్నియాలో ఏర్పడిన రంధ్రాలను మూసివేయడానికి (Perforation ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి ఈ '3డీ-ప్రింటెడ్' కార్నియా ఉపయోగపడుతుంది.

 విజయవంతమైన ప్రయోగం..  

పరిశోధనలో భాగంగా, కృత్రిమంగా తయారు చేసిన ఈ 3డీ-ప్రింటెడ్ కార్నియాను కుందేలు కంటికి విజయవంతంగా అమర్చారు. అనంతరం ఆయా ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, దీనిని మనుషులకు వినియోగించే ముందు క్లినికల్ ట్రయల్స్ (Clinical Trials) జరగాల్సిన అవసరం ఉందని, దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు వివరించారు. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా కార్నియా కొరతకు ఓ ఆశాజనకమైన పరిష్కారాన్ని అందిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : eye-problems vision-loss vision ccmb-hyderabad 3d-printed-cornea india-first-3d-printed-cornea hyderabad-scientists-achievement 3d-bioprinting-cornea-india cornea-transplant-innovation hyderabad-biotech-innovation corneal-tissue-engineering
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com