సాక్షి లైఫ్ : ప్రాణాంతక నిఫా వైరస్ నుంచి రక్షణ కల్పించే దిశగా వైద్య రంగంలో కీలక అడుగు పడింది. అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేసిన సరికొత్త నిఫా వైరస్ వ్యాక్సిన్ 'HeV-sG-V' మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలను ఇచ్చింది. ఈ టీకా సురక్షితమని తేలడమే కాకుండా, శరీరంలో యాంటీబాడీలను సమర్థంగా ప్రేరేపిస్తున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్ 'ది లాన్సెట్' (The Lancet) వెల్లడించింది.
ఇది కూడా చదవండి..ఆందోళన కలిగిస్తున్న ఎం పాక్స్ కొత్త వేరియంట్..
ఇది కూడా చదవండి..మందులతో పనిలేకుండా అధికరక్తపోటు ఎలా తగ్గుతుంది..?
ఇది కూడా చదవండి..ఈ ఐదు చిట్కాలు పాటిస్తే ఎలాంటి రోగాలు రావు..
ఫలితాలు ఎలా ఉన్నాయంటే..?
నమ్మకమైన భద్రత..18 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు గల 192 మంది ఆరోగ్యవంతులపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. టీకా తీసుకున్న వారిలో ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు (Side effects) కనిపించలేదని, కేవలం ఇంజెక్షన్ వేసిన చోట స్వల్ప నొప్పి తప్ప మరే ఇబ్బందీ కలగలేదని పరిశోధకులు తెలిపారు.
మెరుగైన రోగనిరోధక శక్తి.. వ్యాక్సిన్ ఒక డోసు కంటే, రెండు డోసులు తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి అధికంగా కనిపించింది. ముఖ్యంగా 100 మైక్రోగ్రాముల డోసును 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకున్న వారిలో వారం రోజుల్లోనే యాంటీబాడీలు మరింతగా వృద్ధి చెందినట్లుగా ఫలితాల్లో వెల్లడైంది. ఇప్పటివరకు జంతువులపై మాత్రమే జరిగిన ప్రయోగాలు, ఇప్పుడు మానవులపై కూడా విజయవంతం కావడం వ్యాక్సిన్ తయారీలో ఒక పెద్ద మైలురాయి అని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) శాస్త్రవేత్తలు కొనియాడారు.
ఈ వ్యాక్సిన్ ఎందుకు ముఖ్యం అంటే..?
నిఫా వైరస్ వల్ల కలిగే మరణాల రేటు అత్యధికంగా 40 నుంచి 82 శాతం వరకు ఉంటుంది. ప్రస్తుతం దీనికి ఎటువంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకా అందుబాటులో లేదు. కేరళ వంటి రాష్ట్రాల్లో తరచూ ఈ వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో, ఈ టీకా అందుబాటులోకి వస్తే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ టీకాపై త్వరలోనే రెండో దశ (Phase 2) ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. ఇవి కూడా పూర్తయితే భవిష్యత్తులో నిఫా మహమ్మారిని అడ్డుకోవడానికి మన దగ్గర ఒక శక్తివంతమైన ఆయుధం సిద్ధమైనట్లేనని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మెంతులతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా..?
ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com