సాక్షి లైఫ్ : లైంగికంగా సంక్రమించే వ్యాధుల్లో ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న గనేరియా (Gonorrhoea)పై పోరాడేందుకు సరికొత్త మెడిసిన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా నీసేరియా గనేరియా ప్రస్తుత యాంటీబయాటిక్స్‌కు నిరోధకతను పెంచుకుని, "సూపర్ గనేరియా" గా మారుతోంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఈ నేపథ్యంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) రెండు సరికొత్త ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకునే ఔషధాలకు ఆమోదం తెలిపింది.1990ల తర్వాత గోనోరియా చికిత్స కోసం కొత్త తరగతి యాంటీబయాటిక్‌లకు ఆమోదం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
'సూపర్ గనేరియా'కు కొత్త మందులు ఎలా పనిచేస్తాయి..?
గనేరియా చికిత్సలో యాంటీబయాటిక్ నిరోధకతను సమర్థంగా ఎదుర్కొనేందుకు తాజాగా ఆమోదం పొందిన రెండు కొత్త మౌఖిక ఔషధాలు వైద్య ప్రపంచంలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వీటిలో జీఎస్కే (GSK) సంస్థ తయారు చేసిన బ్లూజెపా (Blujepa - జెపోటిడాసిన్) ఒకటి. ఇది ట్రైజాసెనాఫ్థైలీన్ (Triazaacenaphthylene) అనే సరికొత్త యాంటీబయాటిక్ తరగతికి చెందినది.
12 ఏళ్లు నిండి, 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారికి దీన్ని మాత్రల రూపంలో (Oral Tablets) అందిస్తారు. ఇక రెండవది, ఇన్నోవివా (Innoviva) సంస్థ రూపొందించిన నూజోల్వెన్స్ (Nuzolvence - జోలిఫ్లోడాసిన్). ఇది స్పైరోపిరిమిడైనెట్రియోన్ (Spiropyrimidinetrione) అనే మరో కొత్త తరగతికి చెందిన ఔషధం. ఇది కూడా 12 ఏళ్లు నిండి, 35 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న రోగులకు చికిత్సకు ఉపయోగపడుతుంది, అయితే దీన్ని నీటిలో కరిగే గ్రాన్యూల్స్ (Granules) రూపంలో ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ రెండు మందులూ ప్రస్తుత చికిత్సల్లో ఉన్న ఇంజెక్షన్ల అవసరాన్ని తగ్గించి, రోగులకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బ్యాక్టీరియాను ఎలా అడ్డుకుంటాయి..?
ప్రస్తుత యాంటీబయాటిక్స్ పనితీరుకు పూర్తిగా భిన్నంగా ఈ కొత్త మందులు బ్యాక్టీరియాపై పనిచేస్తాయి. బ్లూజెపా (జెపోటిడాసిన్) బ్యాక్టీరియా DNA నకలు (Replication) ప్రక్రియకు అవసరమైన రెండు ఎంజైములను (DNA గైరేస్, టోపోయిసోమెరేస్) నిరోధిస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుదల, విస్తరణ ఆగిపోతుంది.
నూజోల్వెన్స్ (జోలిఫ్లోడాసిన్) కూడా టైప్ II టోపోయిసోమెరేస్ అనే ఎంజైమ్‌ను అడ్డుకుంటుంది, ఇది బ్యాక్టీరియా మనుగడకు అత్యవసరం. ఈ కొత్త యాక్షన్ మెకానిజమ్స్ కారణంగా, పాత మందులకు నిరోధకత చూపించే (Drug-Resistant) గోనోరియా రకాలపై కూడా ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
ఇంజెక్షన్‌కు ప్రత్యామ్నాయం..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గనేరియాకు ప్రామాణిక చికిత్సగా కండరాలలోకి ఇచ్చే సెఫ్ట్రియాక్సోన్ (Ceftriaxone) ఇంజెక్షన్తో పాటు, నోటి ద్వారా తీసుకునే అజిత్రోమైసిన్ (Azithromycin) కాంబినేషన్ థెరపీని వాడుతున్నారు. "క్లినికల్ ట్రయల్స్ (Clinical Trials)"లో, ఈ కొత్త నోటి మాత్రలు (బ్లూజెపా, నూజోల్వెన్స్) ఇంజెక్షన్‌తో కూడిన ప్రామాణిక చికిత్సతో సమానమైన, లేదా కొన్ని సందర్భాల్లో మెరుగైన 91శాతం నుంచి 93శాతం మైక్రోబయలాజికల్ క్యూర్ రేటును చూపించాయి.
రోగులు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన బాధ తప్పుతుంది, చికిత్స మరింత సులభమవుతుంది.గోనోరియా అనేది చికిత్స చేయకపోతే మహిళల్లో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID), వంధ్యత్వం (Infertility) వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. అందుకే, యాంటీబయాటిక్ నిరోధకతను ఎదుర్కోవడంలో ఈ కొత్త ఔషధాల ఆమోదం ఒక చారిత్రక పరిణామంగా నిలిచింది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com