New Study : పురుషులలో బీయర్ బెల్లీ' (పొట్ట)తో హార్ట్ డ్యామేజ్ ముప్పు..  

సాక్షి లైఫ్ : శరీరంలో పేరుకుపోయే కొవ్వులో అత్యంత ప్రమాదకరమైంది ఏదైనా ఉందంటే అది బొడ్డు చుట్టూ పేరుకునే విసెరల్ ఫ్యాట్ (Visceral Fat) లేదా 'బీయర్ బెల్లీ' (Beer Belly) అని మరోసారి రుజువైంది. ఇటీవల రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (RSNA) వార్షిక సమావేశంలో సమర్పించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, బొడ్డు కొవ్వు (Abdominal Obesity) గుండె నిర్మాణంలో హానికరమైన మార్పులకు దారితీస్తుందని తేలింది. ఈ ప్రభావం ముఖ్యంగా పురుషులలో మరింత స్పష్టంగా కనిపించడం ఆందోళనకరం.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

పరిశోధకులు 46 నుంచి 78 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,244 మంది పెద్దలపై అధునాతన కార్డియాక్ MRI స్కాన్‌లను ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. శరీరంలో ఎత్తుకు తగ్గ బరువు (BMI) కంటే, నడుము తుంటి నిష్పత్తి (Waist-to-Hip Ratio) ఎక్కువగా ఉన్న వారిలో గుండె నిర్మాణం మరింత ఆందోళనకరంగా మారుతున్నట్లు గుర్తించారు.

మార్పులు ఏమిటంటే..? 

 కేవలం బొడ్డు కొవ్వు ఉన్న వారిలో గుండె కండరం మందంగా మారడం, గుండె గదుల పరిమాణం చిన్నగా మారడం వంటి 'కన్సెన్ట్రిక్ హైపర్ట్రోఫీ' (Concentric Hypertrophy) అనే మార్పు కనిపించింది. దీనివల్ల గుండె తక్కువ రక్తాన్ని నిల్వ చేసి, పంప్ చేస్తుంది. ఈ మార్పు చివరికి గుండె సరిగా విశ్రాంతి తీసుకోలేకపోయి, గుండె వైఫల్యానికి (Heart Failure) దారితీయవచ్చు.

పురుషుల్లో అధిక ప్రమాదం.. 

ఈ హానికరమైన మార్పులు పురుషులలో, ముఖ్యంగా రక్తాన్ని ఊపిరితి త్తులకు పంపే కుడి జఠరికలో (Right Ventricle) మరింత స్పష్టంగా కనిపించాయని పరిశోధకులు తెలిపారు. బొడ్డు కొవ్వు శ్వాసపై, ఊపిరితిత్తుల ఒత్తిడిపై చూపే ప్రభావమే దీనికి కారణం కావచ్చు అని వారు అభిప్రాయపడ్డారు.

ఈ పరిశోధనలో పాల్గొనని నిపుణులు కూడా ఈ విషయాన్ని బలపరుస్తూ, విసెరల్ ఫ్యాట్ శరీరంలో ఇన్ఫ్లమే షన్ ను (Inflammation), ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని, ఇది గుండె, రక్తనాళాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, బొడ్డు కొవ్వును నియంత్రించుకోవడం అత్యవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : heart-attack heart-risk heart-problems heart-disease how-to-lose-belly-fat belly-fat reduce-belly-fat lose-belly-fat heart-health-tips belly-fat-burning-drink
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com