మృదువైన, ఎర్రని పెదాల కోసం ఇంటి చిట్కాలు..

షేర్ చేయండి:
మృదువైన, ఎర్రని పెదాల కోసం ఇంటి చిట్కాలు..

సాక్షి లైఫ్ : పెదవుల అందం..అనేది అందం సంరక్షణలో ముఖ్యమైన అంశాలలో ఒకటి. అందుకే చాలా మంది పెదాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.పెదాలు నల్లబడటం అనేది ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. తాత్కాలిక ఉపశమనం కోసం లిప్ స్టిక్ దీనికి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. కానీ దానితో చాలా సమస్యలు ఉన్నాయి. లిప్‌స్టిక్‌లలోని రసాయనాలు పెదాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎలాంటి కెమికల్స్ ఎఫెక్ట్ లేకుండా పెదాలను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి పలురకాల సులభమైన మార్గాలను  గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

 రోజూ జామకాయ రసాన్ని పెదవులపై రాసుకోవడం వల్ల పెదాలు ఆకర్షణీయంగా ఉండడమేకాకుండా ఎరుపు రంగులో కనిపిస్తాయి. అర చెంచా నిమ్మరసం, తేనె, గ్లిజరిన్ మిక్స్ చేసి పెదవులపై రాస్తే పెదవుల నలుపు మారుతుంది. ఇది నలుపు రంగును తొలగించడంలో బాగా సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను పెదవులపై రుద్దడం వల్ల పెదాలు రంగు మారుతాయి. ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

 

పెదవులరంగు మారాలంటే..?  

 

ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే.. 

ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

 

పెదవుల రంగు మారాలంటే పెదవులపై ఉన్న మృతకణాలను తొలగించాలి. దీని కోసం ఇంట్లో తయారుచేసిన స్క్రబ్ బీట్‌రూట్ రసం, చక్కెరతో ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు. కొంచెం బీట్‌రూట్ జ్యూస్ లో కొంచెం పంచదార వేసి పేదలను స్క్రబ్ చేయాలి.ఒక టేబుల్ స్పూన్ తేనె , ఒక టీస్పూన్ పంచదార మిక్స్ చేసి మీ పెదాలకు అప్లై చేయండి. చక్కెర రేణువులు కరిగిపోయే వరకు బాగా స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే పెదాలు మృదువుగా మారతాయి.

 

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..? 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.