Pregnant Women : గర్భిణీలు రోజుకు ఎన్ని గంటలు మొబైల్ వాడవచ్చు..?
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో మొబైల్ వాడటం సురక్షితమేనా..? దీని రేడియేషన్ కడుపులోని బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చాలా మందికి వచ్చే ప్రధాన సందేహం. స్మార్ట్ఫోన్ల నుండి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రాలు (EMF), వైఫై (Wi-Fi), 5G నెట్వర్క్ రేడియేషన్ శిశువుకు హానికరమా అనే ఆందోళనలు ఉన్నాయి. మొబైల్ వైర్లెస్ సిగ్నల్స్ పిండం ఎదుగుదలను అడ్డుకుంటాయా, పుట్టబోయే బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్, గుండె స్పందన రేటుపై ఈ రేడియేషన్ ప్రభావం పడుతుందా అని గర్భిణీలు తరచుగా ఆలోచిస్తుంటారు.
మొబైల్ ఎక్కువగా వాడితే పుట్టబోయే బిడ్డకు ఆటిజం, హైపర్ యాక్టివిటీ లేదా ప్రవర్తనా సమస్యలు (Behavioral issues) వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయా అన్నది కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న. స్క్రీన్ సమయం పెరగడం వల్ల గర్భిణీల సొంత ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాలు పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ముఖ్యంగా రాత్రి పూట స్మార్ట్ఫోన్ వెలుతురులో ఎక్కువ సమయం గడపడం వల్ల నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోయి, నిద్రలేమి సమస్యలు వస్తాయా అని వైద్యులను అడుగుతుంటారు. నిరంతర మొబైల్ వాడకం వల్ల కంటి సమస్యలు, దృష్టి లోపాలు, తలనొప్పి, మైగ్రేన్ వంటివి రావడమే కాకుండా, ఎక్కువసేపు వంగి ఫోన్ చూడటం వల్ల వెన్నునొప్పి వస్తుందా అన్నది కూడా గమనించాల్సిన విషయం
అలాగే, గర్భధారణ సమయంలో సోషల్ మీడియా అధిక వాడకం వల్ల గర్భిణీలలో మానసిక ఒత్తిడి పెరుగుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవు తున్నాయి. స్క్రీన్ సమయం పెరగడం వల్ల గర్భిణీలలో మానసిక ఒత్తిడి పెరుగుతుందా?ల్యాప్టాప్ను ఒడిలో లేదా కడుపుకు దగ్గరగా పెట్టుకుని పనిచేయడం గర్భస్థ శిశువుకు సురక్షితమేనా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
