చలికాలంలో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి..?
సాక్షి లైఫ్ : శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే కొందరిలో జలుబు, జ్వరం,దగ్గు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా హెల్తీగా ఉండవచ్చు. అందుకోసం ఏమేం తీసుకుంటే బెటర్ అంటే..? ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి. ఇది లోపిస్తే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకోసమే శారీరంలో ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకోవాలి. ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు..? అందుకోసం ఏం చేయాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బెస్ట్ విటమిన్స్ ఫుడ్..
మనం తీసుకునే ఆహారంలో పసుపు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు వంటి దినుసులు ఉండేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే "ఏ", "సి", "డి", "ఇ" విటమిన్లు అధికంగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..
ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?
ఇమ్యూనిటీ..
తగిన పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వంటివి తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ ను పొందవచ్చు. పాలకూర, మెంతికూర, తోటకూర, క్యారెట్ వంటివి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
సీడ్స్..
పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, చియా గింజలు, అవిసె గింజలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. కోడిగుడ్లు, చికెన్, మటన్, తదితర ఆహారాలను తరచూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
