సాక్షి లైఫ్ : బీర్ తాగడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి. బీర్ తాగడం వల్ల బరువు పెరగడంతోపాటు కాలేయ సమస్యలు, నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలనుకుంటే బీర్‌కు వీడ్కోలు చెప్పాల్సిందే.. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ బీర్ తాగడం వల్ల ఎలాంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బీర్ ప్రియులు ఉన్నారు. కొందరు పార్టీలు లేదా క్లబ్బులకు వెళ్లి చల్లని బీర్ తాగుతారు. మరికొంతమందికి ఇంట్లో కూడా బీరు తాగే అలవాటు ఉంటుంది. ఏదైనా మితిమీరి బీర్ తాగితే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు వైద్యనిపుణులు. ప్రతి రోజూ బీర్ తాగడం వల్ల మీ ఆరోగ్యం మరింత దిగజారుతుంది.
ఇది కూడా చదవండి..జుట్టు రాలడానికి జీవనశైలి అలవాట్లు కూడా కారణమేనా..?
ఇది కూడా చదవండి..లివర్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..కొత్త పరిశోధన : కండరాల పనితీరులో బాదం కీలక పాత్ర
ఇది కూడా చదవండి..చలికాలంలో ఉసిరికాయను ఇలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..
ఇది కూడా చదవండి..వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?
ప్రస్తుతం యువతలో కూడా బీర్ ట్రెండ్ ఎంతగా పెరిగిపోతుందో.. అందరికీ తెలిసిందే.. దీంతో యువతలో సైతం తీవ్రమైన వ్యాధులు పెరుగు తున్నాయి. బీర్ తాగడంవల్ల కొంతకాలం ఒత్తిడిని తగ్గించవచ్చు, కానీ భవిష్యత్తులో ఇది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది.
క్యాన్సర్..
బీర్ క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతుంది. ప్రతిరోజూ బీర్ తాగితే నోరు, కాలేయం, బ్రెస్ట్ , గొంతు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. మీకు రోజూ బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయడం ఉత్తమం.
బరువు..
బీర్‌లో క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా బీర్ తాగితే, మీ బరువు వేగంగా పెరుగుతుంది. దీనిని బీర్ బెల్లీ అని కూడా అంటారు. బీర్ తాగడం వల్ల ముఖ్యంగా పొట్ట చుట్టూ బరువు పెరుగుతుంది. మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే, పొరపాటున కూడా బీరును ముట్టుకోకండి.
కాలేయంపై ప్రభావం..
బీర్‌లో ఆల్కహాల్ ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మీకు ఏదైనా కాలేయ సంబంధిత సమస్య ఉంటే లేదా మీరు ఈ సమస్యలను నివారించాలనుకుంటే, మీరు బీర్‌కు దూరంగా ఉండడం మంచిది.
గుండె జబ్బులు..
బీర్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బీర్ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, అది ప్రమాదకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. బీర్ గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా పరిగణిస్తారు. అంతేకాదు ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
నిద్రపై ఎఫెక్ట్..
బీర్ గాఢ నిద్రకు (మంచి నిద్ర) ఆటంకం కలిగిస్తుంది. పడుకునే ముందు బీర్ తాగడం వల్ల అర్థరాత్రి తరచుగా లేవాల్సి వస్తుంది.
మధుమేహం..
బీర్‌లో అధిక మొత్తంలో చక్కెర, కేలరీలు ఉంటాయి. బీర్ తాగడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు బీర్ తాగడం మానేయాలి, ఒకవేళ తాగాల్సి వస్తే డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..చలికాలంలో విటమిన్-డి లోపాన్ని ఎలా అధిగమించాలి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక ఆస్తమా మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే..
ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com