Vitamin D : వేసవిలోనూ సూర్యుడి నుంచి విటమిన్ "డి" లభిస్తుందా..? 

సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి విటమిన్ డి అనేది అత్యవసరం. సూర్యరశ్మి దీనికి ప్రధాన వనరు. మరి భానుడు భగభగలాడే వేసవిలోనూ ఎండలో ఉండటం సురక్షితమేనా..? వైద్యనిపుణులు ఏం చెబుతున్నారు..? ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి, కాల్షియం శోషణకు, ఎముకలు, దంతాల పటుత్వానికి విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విటమిన్-డి లోపం ఒక ప్రధాన ఆందోళనగా మారింది. భారతదేశం వంటి సూర్యరశ్మి పుష్కలంగా ఉండే దేశంలో కూడా 70 నుంచి 80 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

ఎండలో ఉండాలా..? వద్దా..?

సూర్యరశ్మిని 'సన్‌షైన్ విటమిన్' అని పిలుస్తారు. చర్మంపై సూర్యకిరణాలు పడినప్పుడు శరీరం సహజంగానే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అయితే, వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎండలో ఉండాలనేది ముఖ్యం.

  ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య సుమారు 15-20 నిమిషాల పాటు లేత ఎండలో నడిచినా లేదా నిలబడినా శరీరానికి అవసరమైన విటమిన్-డి లభిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయట తిరగడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

  
తీవ్రమైన సూర్యరశ్మికి గురికావడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం నల్లబడటం అంటే టానింగ్ అవ్వడంతో పాటు, యూవీ (UV) కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అధిక వేడి వల్ల శరీరం చల్లబడటానికి చెమటను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల శరీరం త్వరగా అలసిపోయి నీరసానికి గురవుతుంది.

ఆహారం ద్వారా కూడా..

కేవలం ఎండ ద్వారానే కాకుండా, కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి స్థాయిలను పెంచుకోవచ్చు.
కొవ్వు అధికంగా ఉండే చేపలు, గుడ్డులోని సొన, పాలు, పెరుగు, తృణధాన్యాలు, పుట్టగొడుగులు వంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. 

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : vitamin-d vitamins vitamin-b12-deficiency d-vitamin vitamin-d-levels-test vitamin-d-deficiency-symptoms vitamin-d-deficiency-treatment
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com