ChatGPT Fails to Detect Critical Emergency : ఏఐ వైద్యం.. ప్రాణసంకటం..! అత్యవసర స్థితిని గుర్తించడంలో 'చాట్ జీపీటీ' విఫలం..
సాక్షి లైఫ్ : ఆధునిక కాలంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్‌నో లేదా చాట్ జీపీటీ (ChatGPT) వంటి ఏఐ సాధనాలనో ఆశ్రయించడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఈ ఏఐ సలహాలను నమ్మడం ప్రాణాల మీదకు తెస్తుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 'చాట్ జీపీటీ హెల్త్' అందించే సమాచారం నమ్మదగ్గది కాదని, అది మెడికల్ ఎమర్జెన్సీని గుర్తించడంలో ఘోరంగా విఫలమవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర అంశాలు..
అధ్యయనం ప్రకారం, సగానికి పైగా అత్యవసర కేసుల్లో చాట్ జీపీటీ అనారోగ్య సమస్య వచ్చిన బాధితులకు ఆస్పత్రికి వెళ్లాలని సూచించలేదు. నిజానికి ఆ పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. గుండెపోటు లక్షణాలు, తీవ్రమైన శ్వాసకోస సమస్యలు లేదా అంతర్గత రక్తస్రావం వంటి అత్యవసర స్థితిని ఏఐ సాధనాలు సాధారణ సమస్యలుగానే పరిగణిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.
రోగి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఏఐ ఇచ్చే సమాచారం రోగులకు "అంతా బాగుంది" అనే తప్పుడు భరోసాను కల్పిస్తోంది. దీనివల్ల బాధితులు వైద్యుని వద్దకు వెళ్లడం ఆలస్యమవుతోంది.
అత్యంత ప్రమాదకరం..
వైద్య నిపుణులు ఈ పరిస్థితిని 'అన్ బిలీవబుల్లీ డేంజరస్' నమ్మ లేనంత ప్రమాదకరం గా అభివర్ణిస్తున్నారు. వైద్య పరిజ్ఞానం లేని సాధారణ ప్రజలు ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల ప్రాణ నష్టం జరిగే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఏఐ అనేది కేవలం అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా సమాచారాన్ని క్రోడీకరిస్తుంది తప్ప, ఒక రోగి క్లినికల్ పరిస్థితిని ప్రత్యక్షంగా అంచనా వేయలేదు.
అత్యవసర సమయంలో ఫోన్లతో కాలక్షేపం చేయడం వల్ల విలువైన 'గోల్డెన్ అవర్' అంటే ప్రాణాలు కాపాడే కీలక సమయం వృథా అవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏఐ లేదా ఇంటర్నెట్ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. గుండెనొప్పి, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన గాయాలు వంటి సందర్భాల్లో ఏఐ సలహాల కోసం వేచి చూడకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లడం ఉత్తమమని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
