ఆటిజంను మొదటి దశలోనే గుర్తింవచ్చు.. ఎలా అంటే..? 

షేర్ చేయండి:
ఆటిజంను మొదటి దశలోనే గుర్తింవచ్చు.. ఎలా అంటే..? 

సాక్షి లైఫ్ : ఎలాంటి వ్యాధినైనా ముందుగా గుర్తిస్తే సులువుగా అది ముదరకముందే జాగ్రత్త పడొచ్చు.. అంతేకాదు ఆయా సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు కూడా. అందుకోసమే కొంతమంది పరిశోధకులు అలాంటి కొన్నిరకాల వ్యాధులపై నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఎదుర్కొనే ఆటిజంను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. 

ఇది కూడా చదవండి.. గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?  

ఇది కూడా చదవండి.. పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఏఐ మోడల్.. 

ఆటిజంను మొదటి దశలోనే గుర్తింవచ్చని కొత్త మెషిన్ లెర్నింగ్ మోడల్ ద్వారా నిరూపించింది కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌. ఇటీవల దీనిపై  కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఇక నుంచి ఆటిజంను ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)మోడల్ ద్వారా గుర్తించనున్నారు. రెండు సంవత్సరాల వయసు లోపు చిన్నారుల్లో ఈ మోడల్‌ ఖచ్చితత్వంతో ఆటిజమ్‌ను అంచనా వేయడం ద్వారా వైద్య రంగంలో ఎంతో విలువైన పరికరంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 

అధ్యయనంలో భాగంగా ఆటిజమ్‌ లక్షణాలు కలిగిన, అస్సలు అటువంటి లక్షణాలే లేని సుమారు మూడు వేల మందిపై పరిశోధన చేశారు. వేర్వేరు ప్రమాణాలను విశ్లేషించి, నాలుగు మెషిన్‌ లెర్నింగ్‌ మోడళ్లను తయారు చేశారు.అటువంటివాటిల్లో ‘ఆట్‌మెడ్‌ఏఐ’ అనే మోడల్‌ అన్నింటికంటే  ఉత్తమమైన ఫలితాలను కనబరిచింది. 

 ఖచ్చితత్వంతో.. 

ఇందులో సుమారు 12వేల మంది నుంచి 80శాతం ఖచ్చితత్వంతో ఆటిజమ్‌ పిల్లలను కనుగొనగా, ఆటిజమ్‌ను అంచనా వేవేసేందుకు మొదటిసారిగా నవ్వడం, మొదటిసారిగా చిన్న పదాలు పలకడం, ఆహారం  సరిగా తినలేకపోవడం వంటి లక్షణాలను ప్రమాణాలు తీసుకోవడం  విశేషం. 

ఆటిజమ్‌ వచ్చే అవకాశాలు ఉండేవారిని.. 

సమాచారం పెద్దగా అందుబాటులో లేకపోయినా ఆటిజమ్‌ వచ్చే అవకాశాలు ఉండేవారిని ఈ సరికొత్త మోడల్‌ సాయంతో గుర్తించడానికి  వీలుకలుగుతుందని అధ్యయనం నిర్వహించిన బృందానికి నాయకత్వం వహించిన శ్యామ్‌ రాజగోపాలన్‌ వెల్లడించారు. ఆటిజమ్‌ను త్వరగా గుర్తించటం, చికిత్స విషయంలో ఇది గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి.. సున్నితమైన చర్మం కోసం ఎలాంటి ఉత్పత్తులను ఎంచుకోవాలి..?

ఇది కూడా చదవండి.. యాంటీ ఏజింగ్‌ విషయంలో మునగాకు పొడి ఎంతబాగా పనిచేస్తుందో తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.