కాలేయ వ్యాధులకు కారణాలు అసలు కారణాలు..?
సాక్షి లైఫ్ : భారతదేశంలోని ప్రతి 10 మంది పెద్దలలో ఒకరు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో దాదాపు 60 శాతం మంది రోగులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడు తున్నారు. ప్రారంభ దశలో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం వల్ల లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు.
కాలేయ సమస్యల్లో ప్రధానమైంది ఫ్యాటీ లివర్ ఒకటి. ఇలాంటి సమస్యలు ఉన్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు కూడా ప్రజలకు ఇదే సలహా ఇస్తున్నారు.
చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
ప్రారంభదశలో లక్షణాలు..
ప్రారంభదశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల, పెద్ద సంఖ్యలో రోగులు లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు గురవుతున్నారు. జంక్ ఫుడ్, పదే పదే వేడిచేసిన నూనెలో వేయించిన వంటకాలు, ప్రిజర్వేటివ్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్ కాలేయ వ్యాధులకు కారణమవుతు న్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి..
లివర్ సంబంధిత సమస్యలకు అతిపెద్ద కారణం పాశ్చాత్య జీవనశైలి. ఎక్కడపడితే అక్కడ లభించే ఆహారం, జీవనశైలి అలవాట్లు కూడా ఇందుకు కారణాలే. ఇంతకుముందు కాలేయ వ్యాధి పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉండేది. అయితే గత 15 ఏళ్లలో ఆయా దేశాల్లో తగ్గింది. భారతదేశంలో మాత్రం వేగంగా పెరుగుతోంది.
అధిక కొలెస్ట్రాల్..
ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్ ,మధుమేహం ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ముఖ్యమైన కారకాలు. తినే ఆహారంలో అధిక కొవ్వును తీసుకుంటే, అది కాలేయంలో పేరుకుపోవడం ప్రారంభమ వుతుంది. తద్వారా అది వాస్తుంది. దీనిని ఫ్యాటీ లివర్ అంటారు.
లివర్ ఫెయిల్యూర్..
కాలేయం కొత్త కణాలను సృష్టించడం ద్వారా స్వయంగా మరమ్మత్తు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ అలవాట్లు మెరుగుపడకపోతే, దెబ్బతిన్న కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితిని లివర్ సిర్రోసిస్ అంటే కాలేయ వైఫల్యం అంటారు. ఆహార పదార్థాల రుచిని పెంచడానికి అజినోమాటో, ఎక్కువ సమయం నిల్వ ఉంచేందుకు వేసే ప్రిజర్వేటివ్స్,అందంగా కనిపించేందుకు కృత్రిమ రంగులు, అదే నూనెను పదే పదే వేడి చేసి తయారుచేసే వంటకాలు కాలేయ క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి.
ప్రపంచ జనాభాలో 25 శాతం మంది కాలేయ వ్యాధుల బారిన పడుతు న్నారని పరిశోధకులు చెబుతున్నారు. దేశంలో ప్రతి 10 మందిలో ఒక రోగి ఉన్నట్లు అంచనా. ప్రతి 10 మంది కొవ్వు కాలేయ రోగులలో ఇద్దరికి లివర్ సిర్రోసిస్ ఉంటుంది. హెపటైటిస్ బి, సి లివర్ సిర్రోసిస్‌గా మారకపోతే చికిత్స చేయవచ్చు, అయితే ఆహారం, వ్యాయామం ద్వారా మాత్రమే కొవ్వు కాలేయాన్ని నయం చేయవచ్చు.
ఇది కూడా చదవండి..చలికాలంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?
ఇది కూడా చదవండి..వింటర్ సీజన్ అలర్ట్ : ఉసిరిలో అనేక ఔషధ గుణాలు..
ఇది కూడా చదవండి..డిజిటల్ యుగంలో యువతలో స్ట్రోక్ కేసులు..పెరగడానికి ఈ అలవాట్లే కారణం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
