తినక ముందు, తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం : ఐసీఎంఆర్

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : టీ, కాఫీలు తాగడానికి ఇష్టపడని వారు ఉండరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే పానీయాలు కూడా ఇవి. ప్రజలు ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వీటిని తాగడానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. తిన్న తర్వాత టీ లేదా కాఫీ ఎందుకు తాగకూడదో ఐసీఎంఆర్ వివరించింది.

ఇది కూడా చదవండి.. అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..?  

 ఆరోగ్యానికి హాని.. 

టీ లేదా కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలు. వీటిని భారతదేశంలో ప్రజలు తాగడానికి ఆసక్తి చూపుతారు. కొంతమందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వారు రోజంతా ఏదొక సమయంలో తాగుతూనే ఉంటారు. కాఫీ, టీలు భోజనానికి గంట ముందు, భోజనానికి గంట తర్వాత ఇవి అధిక మొత్తంలో తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఐసీఎంఆర్ హెచ్చరించింది.  

 టీ, కాఫీ.. 


ముఖ్యంగా తినే ముందు లేదా తర్వాత టీ లేదా కాఫీ తాగడం మీ ఆరోగ్యానికి హానికరమని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్వయంగా ఇటీవల భారతీయుల కోసం సవరించిన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో టీ, కాఫీ తాగడానికి సంబంధించిన సలహాలను కూడా వెల్లడించింది. టీ, కాఫీ గురించి ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.. 

 ఇది కూడా చదవండి.. బరువు తగ్గించే నల్ల ఉప్పు.. 


భోజనం తర్వాత లేదా ముందు టీ లేదా కాఫీ ఎందుకు తాగకూడదు..?

 భోజనానికి ముందు,తర్వాత కనీసం ఒక గంట పాటు టీ , కాఫీ తాగడం మానేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఎందుకంటే ఇవి రెండూ ఇనుము శోషణను అడ్డుకుంటాయని, రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ప్రజలు టీ లేదా కాఫీని తీసుకునే సమయాన్ని గమనించాలని సూచించింది. ఎందుకంటే రెండు పానీయాలలో ఉండే టానిన్‌లు ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. 

ఇది కూడా చదవండి.. ఆక్సిటోసిన్‌ పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు.. 

టీ లేదా కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మానసికంగా వీటిపై ఆధారపడటాన్ని ప్రేరేపిస్తుంది. అధికంగా కాఫీ తాగడం వల్ల రక్తపోటు, సక్రమంగా గుండె కొట్టుకోవడం, చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను పెంచుతుంది. అంతేకాదు ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. ఒక కప్పు (150 ml) కాఫీలో 80-120 mg కెఫీన్ ఉంటుంది. అదే ఇన్‌స్టంట్ కాఫీలో 50-65 mg, టీలో 30-65 mg కెఫిన్ ఉంటుంది. ఈ పానీయాలను వీలైనంత పరిమిత పరిమాణంలో తీసుకోవాలని ఐసీఎంఆర్ నివేదిక తెలిపింది.  

ఇది కూడా చదవండి.. మహిళలకు రిగ్యులర్ గా ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.