Toxic Chemicals in Receipts : ఆ రసీదుల వెనుక ప్రాణాంతక రసాయనాలు.. గర్భిణులు, పిల్లలకు మరింత డేంజర్..
సాక్షి లైఫ్ : మనం షాపింగ్ చేసినా, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన వెంటనే చేతికి వచ్చే పేపర్ 'రిసిప్ట్' మన ప్రాణాలకు అపాయం కలిగిస్తుందన్న విషయం మీకు తెలుసా..? ఆ చిన్న పేపర్ ముక్క వెనుక మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషపూరిత రసాయనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రిసిప్ట్ లపై అక్షరాలు ముద్రించడానికి వాడే థర్మల్ పేపర్ ,ఇంక్ లో ఉండే బిస్ఫినాల్ ఏ (BPA), బిస్ఫినాల్ ఎస్ (4,4'-సల్ఫోనిల్ డైఫినాల్) (BPS) వంటి రసాయనాలు నేరుగా మన రక్తప్రవాహంలోకి చేరి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతు న్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఆ రసాయనాలు ఎందుకు ప్రమాదకరం అంటే..?
థర్మల్ పేపర్లపై అక్షరాలు, అంకెలు ముద్రించడా నికి ల్యూకో డై, బి.పి.ఎ (Bisphenol A) వంటి రసాయనాల ను ఉపయోగిస్తారు. వీటి కారణంగా తీవ్ర వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇలాంటి కెమికల్స్ వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు తేల్చాయి.
హార్మోన్ల అసమతుల్యత.. బి.పి.ఎస్ (BPS) వల్ల స్థూలకాయం, జీవక్రియ సమస్యలతో పాటు హార్మోన్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది. ఇవి పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి.
మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
డిజిటల్ రసీదులు తీసుకోవడం ఉత్తమం.. వీలైనంత వరకు పేపర్ రిసిప్ట్ లను నివారించండి. ఇప్పుడు దాదాపు అన్ని షోరూమ్‌లలో మొబైల్‌కు లేదా ఈ మెయిల్‌కు డిజిటల్ రసీదులు పంపే సౌకర్యం ఉంది. వాటినే ఎంచుకోవడం ఉత్తమం.
శానిటైజర్ వాడేటప్పుడు..!
రిసిప్ట్ ను తాకే ముందు హ్యాండ్ శానిటైజర్ వాడటం అత్యంత ప్రమాదకరం. శానిటైజర్ వాడటం వల్ల చర్మం ఆ రసాయనాలను 100 రెట్లు వేగంగా గ్రహిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, రసీదును తాకిన తర్వాతే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
గర్భిణులు, పిల్లలు దూరంగా ఉండాలి..
గర్భిణీలు, చిన్న పిల్లలు ఈ థర్మల్ రిసిప్ట్ లను తాకకపోవడమే మంచిది. ఇందులోని రసాయనాలు గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఒకవేళ వృత్తిరీత్యా తాకాల్సి వస్తే..
ఒకవేళ మీరు బిల్లింగ్ సెక్షన్లలో పనిచేస్తూ రోజూ రసీదులను తాకాల్సి వస్తే, వేళ్లకు ప్రొటెక్టివ్ క్యాప్స్ (Finger Cots) లేదా గ్లౌజులు ధరించండి. ముఖ్యంగా రసీదు రోల్స్ మార్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ఆహార పదార్థాలతోపాటు కలపవద్దు..
చాలామంది షాపింగ్ బిల్లులను కూరగాయలు లేదా ఇతర ఆహార పదార్థాల సంచుల్లో వేస్తుంటారు. దీనివల్ల ఆ రసాయనాలు ఆహారానికి అంటుకునే ప్రమాదం ఉంది. రసీదులను ఎప్పుడూ విడిగా భద్రపరుచు కోవాలి. చిన్నపాటి అప్రమత్తత మనల్ని పెద్ద అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. ఇకపై షాపింగ్ ముగించాక ఆ రసీదును అందుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది..!
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
