సాక్షి లైఫ్ : దంతాలు వచ్చినా, రాకపోయినా శిశువులు పాలు తాగిన తర్వాత నోరంతా శభ్రంగా కడగాలి. వేలితో చిగుళ్లను మర్దన చేయాలి. పాల సీసా పీకను నోట్లోనే ఉంచి నిద్రపుచ్చకూడదు. ఏదైనా తిన్న తర్వాత పుక్కిలించి ఊయడం, నోటిని శుభ్రం గా కడుక్కోవడం వంటి పనులను పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలకు దంతాలు ఎలా తోమాలో తల్లిదండ్రులే దగ్గరుండి నేర్పించాలి.
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
బ్రష్ ఎలా చేయాలి..?
కిందిపండ్లు పైకి, పై పండు కిందికి బ్రష్ చేయాలి. పెద్దలు వాళ్ళు కూడా బ్రష్‌ని ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి. పంటి నొప్పి లేదా చిగురు వాపు వస్తే దంతానికి జందూబామ్ లేదా అమృతాంజన్ వంటివి రాయకూడదు. పంటి సందుల్లో పుల్లలు, పిన్సీసులు వంటివి పెట్టి కెలకకూడదు. పాన్, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నమలకూడదు. గరుకైన పొడులను, గట్టిగా ఉండే బ్రష్‌లను దంతాలు శుభ్రంచేయడానికి ఉపయోగించకూడదు.
కంటి నరాలకు..
అతి చల్లగా కానీ లేదా అతి వేడిగా ఉండే పదార్థాలను, పానీయాలను పంటికి తగలకుండా జాగ్రత్తపడితే మంచిది. దంతాలకు వైద్యం చేయించుకుంటే చూపు మందగి స్తుందని చాలామంది అనుకుంటారు. ఇది పెద్ద అపోహ. పంటి నరాలకు, కంటి నరాలకు సంబంధమే లేదు. పండ్లు పుచ్చిపోవడానికి పురుగులు కారణం అనుకుంటారు. అది కూడా తప్పే. పండ్లు పుచ్చిపోవడానికి అసలు కారణం సూక్షజీవులే.
పళ్లు పుచ్చిపోవడం మరో సమస్య. పుచ్చడం ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారు దంతాల సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మరింత ప్రమాదం. కాబట్టి దంత సంరక్షణలో అవసరమైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండండి.
దంతాలను, చిగుళ్లను అన్ని వైపులా శుభ్రంచేసుకోక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మనం తిన్న ఆహారం పండ్లలో ఇరుక్కుపోయి కుళ్లిపోయి దంత సమస్యలు వస్తాయి. అందుకే చిగుళ్లు వాయడం, రక్తంకారడం జరుగుతుంది.