ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నివేదిక..   

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తోపాటు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం ద్వారా, క్యాన్సర్ మరణాల రేటును తగ్గించవచ్చు. దీని గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఇప్పటికే క్యాన్సర్ వచ్చిన వారిలో చాలామంది కోలుకున్నారు. వీరిలో ప్రముఖ సినిమా తారలు కూడా ఉన్నారు.  
 
 క్యాన్సర్ అనేది శరీరంలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. 2018లో దాదాపు 90.6 లక్షల మంది క్యాన్సర్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కాబట్టి ఈ ప్రాణాంతక వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం. అందుకోసమే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతారు. రాబోయే 25 ఏళ్లలో క్యాన్సర్ కేసులు 77 శాతం పెరిగే అవకాశం ఉందని, కొన్నిరకాల పద్ధతులతో వాటిని నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  

క్యాన్సర్‌ను దాని ప్రారంభ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.

క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

 2050 సంవత్సరంలో కొత్త కేసులలో 77 శాతం పెరుగుదల ఉండవచ్చని ప్రపంచఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.  

ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నివేదిక.. 

2020 సంవత్సరంతో పోల్చితే 2050 నాటికి కొత్త క్యాన్సర్ కేసులు దాదాపు 77 శాతం పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన క్యాన్సర్ ఏజెన్సీ అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం.. 2050లో దాదాపు 3.5 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు తలెత్తే అవకాశం ఉంది. పెరుగుతున్న క్యాన్సర్ కేసుల వెనుక కారణాలు: 

పొగాకు వినియోగం, ఊబకాయం, మద్యపానం,వాయు కాలుష్యం వల్ల పలురకాల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం, తక్కువ మానవ అభివృద్ధి సూచిక ఉన్న దేశాలపై ఇది అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. క్యాన్సర్ కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు కూడా ఈ దేశాలలో సంభవిస్తున్నాయి.  

ఈ దేశాలలో కొత్త క్యాన్సర్ కేసులు 142 శాతం పెరగవచ్చు. మానవాభివృద్ధి సూచీ ఎక్కువగా ఉన్న దేశాల్లో దాదాపు 40 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నివేదికను చూసిన తర్వాత, క్యాన్సర్ గురించి అవగాహన, దాని ప్రారంభ చికిత్స ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు.

క్యాన్సర్ అంటే ఏమిటి..?

సాధారణ కణాలలో అసాధారణ మార్పుల కారణంగా, అవి క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెంది అవి చివరికి క్యాన్సర్‌కు దారితీసే కణాలు అసాధారణ రేటుతో పెరుగుతాయి. 

ఈ క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే, అవి శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయి. క్యాన్సర్ లక్షణాలు అది ఏ అవయవంలో సంభవిస్తుందనే దానిపై ఆధారపడి ఉన్నప్పటికీ, ప్రతి క్యాన్సర్‌కు కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి, వాటి సహాయంతో దానిని సకాలంలో గుర్తించి చికిత్స చేయవచ్చు. 

గర్భాశయ క్యాన్సర్,అండాశయ క్యాన్సర్, ఎండో మెట్రియల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి మహిళల్లో ఎక్కువగా వస్తున్నాయి. 

 ఇది కూడా చదవండి.. హానికరం : పంచామృతంలో నెయ్యి-తేనె ఉంటాయి కదా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : world-cancer-day-2024

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com