లేటెస్ట్ స్టడీ: ఆరు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే సూపర్ ఫ్రూట్
సాక్షి లైఫ్ : చలికాలంలో పండే దానిమ్మపండు, ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తాజా పరిశోధన ప్రకారం, దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఆరు రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుందని వెల్లడైంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆఫ్రికా, బంగ్లాదేశ్, కొరియా, నైజీరియా వంటి దేశాలకు చెందిన పరిశోధకుల బృందం దానిమ్మపై ప్రత్యేకంగా రీసెర్చ్ చేసింది. ఈ అధ్యయనంలో దానిమ్మ లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ను న్యాచురల్ గా ఎలా తగ్గించవచ్చు..?
ఇది కూడా చదవండి..మూర్ఛలకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి అడపా దడపా ఉపవాసం ఆరోగ్యకరమైనదేనా..?
దానిమ్మలో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని ఈ పరిశోధకుల బృందం తేల్చింది. దానిమ్మ ప్రోస్టేట్, రొమ్ము, చర్మం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు వంటి వివిధ క్యాన్సర్లను నిరోధించగలదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
అయితే, దానిమ్మపండ్ల ప్రయోజనాలు కేవలం క్యాన్సర్ వంటి మహామ్మారివ్యాధులకే కాకుండా, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక మంటలను తగ్గించడం, కండరాల బరువు కోల్పోవడాన్ని నివారించడంతోపాటు టైప్ 2 డయాబెటిస్ రోగుల హార్మోన్ స్థాయిలను సరిచేయడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆహార విధానాలతో సహా జీవనశైలి కారకాలను సవరించడం ద్వారా 45శాతం కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులను నివారించవచ్చని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అంచనా వేసింది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించిన జనవరి 2025 అధ్యయనంలో దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు గురించి వివరించారు.
ఆహార నియమావళిలో విభిన్నమైన కూరగాయలు,పండ్లను చేర్చుకోవడం వల్ల సంవత్సరానికి కనీసం 20శాతం క్యాన్సర్ ను అడ్డుకోవచ్చని, దీనివల్ల సుమారు 200,000 క్యాన్సర్ సంబంధిత మరణాలను నివారించవచ్చని ఆశా భావం వ్యక్తం చేసింది పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆఫ్రికా, బంగ్లాదేశ్, కొరియా, నైజీరియాలకు చెందిన పరిశోధకుల బృందం పేర్కొంది..
ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
