Night Shift Workers at Higher Risk : నైట్ షిఫ్టులు చేసేవారిలో మధుమేహం, హార్మోన్ల సమస్యలు : తాజా అధ్యయనం..

షేర్ చేయండి:
Night Shift Workers at Higher Risk : నైట్ షిఫ్టులు చేసేవారిలో మధుమేహం, హార్మోన్ల సమస్యలు : తాజా అధ్యయనం..

సాక్షి లైఫ్ : రాత్రి వేళల్లో పని చేసే వారి ఆరోగ్యానికి సంబంధించి చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పగలు పని చేసే వారితో పోలిస్తే, నైట్ షిఫ్టులు చేసే వారిలో మధుమేహం (Diabetes), హార్మోన్ల అసమతుల్యత తలెత్తే ముప్పు ఎక్కువగా ఉందని గాంధీ మెడికల్ కాలేజీ (GMC) వైద్యుల తాజా అధ్యయనం హెచ్చరించింది. 'ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం'లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 

అధ్యయనంలోని ముఖ్యాంశాలు..

నైట్ షిఫ్టులు చేసే ఐటీ ఉద్యోగులపై నిర్వహించిన ఈ పరిశోధనలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. నైట్ షిఫ్ట్ చేసే వారిలో సుమారు 77 శాతం మంది ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) కలిగి ఉన్నారు. ఇది టైప్-2 మధుమేహానికి ప్రాథమిక సంకేతం. పగలు పని చేసే వారిలో ఇది 62 శాతంగానే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వయసు తక్కువగా ఉండి, తక్కువ శరీర బరువు (BMI) ఉన్నప్పటికీ నైట్ షిఫ్ట్ ఉద్యోగుల మెటబాలిక్ ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటోంది.

హార్మోన్లపై ప్రభావం..

శరీరంలోని సహజ సిద్ధమైన జీవ గడియారం (Circadian Rhythm) దెబ్బతినడం వల్ల అనేక హార్మోన్ల సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రి పూట విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ తగ్గడం వల్ల శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ మందగిస్తోంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోవడం వల్ల శీఘ్రస్ఖలనం, ఇతర లైంగిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిల్లో మార్పుల వల్ల నెలసరి సమస్యలు, సంతానలేమి వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రెట్టింపు స్థాయిలో..

 పగటిపూట పని చేసే వారితో పోలిస్తే, నైట్ షిఫ్ట్ చేసే వారిలో థైరాయిడ్ సమస్యలు రెట్టింపు స్థాయిలో 22 శాతం ఉన్నట్లు గుర్తించారు. కేవలం బరువు చూసుకుంటే సరిపోదు..! సాధారణంగా మనం బరువు, నడుము చుట్టుకొలత బాగుంటే ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తాం. కానీ నైట్ షిఫ్ట్ చేసే వారి విషయంలో ఇది సరికాదని  వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

నిద్ర లేకపోవడం వల్ల మైటోకాండ్రియా పనితీరు తగ్గి, ఎదుగుదల హార్మోన్లు (Growth Hormones) క్షీణిస్తాయి. ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గిపోతుంది. ఐటీ, రవాణా, ఆరోగ్య రంగాల్లో రాత్రి వేళల్లో పని చేసే వారు క్రమం తప్పకుండా హార్మోన్ల పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నైట్ షిఫ్టుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి సరైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, అందుబాటులో ఉన్న సమయంలో నాణ్యమైన నిద్ర అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.