ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఫ్లూ గురించి నిర్వహించిన సర్వే రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..
సాక్షి లైఫ్ : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఫ్లూ కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో ఇటీవలి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లలో ఒక సర్వే నిర్వహించారు.
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
13వేల మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. వారిలో 63శాతం పురుషులు,37శాతం మహిళలు ఉన్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం..9శాతం మంది ప్రజలు తమ ఇంట్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్యంతో ఉన్నట్లు తేలింది.
45శాతం మంది ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యులు ఫ్లూ లక్షణాలను ఎదుర్కొంటున్నారు. 36శాతం మంది తమ ఇంట్లో ఎటువంటి వ్యాధి లేదని నివేదించారు. అయితే, 10శాతం మంది స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
ఎలాంటి వ్యక్తులకు ఎక్కువ ప్రమాదం..?
శిశువులు, సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారు
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు
ఉబ్బసం, అధిక రక్తపోటు, మధుమేహం, సిఓపిడి లేదా గుండె జబ్బులు వంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
