Major Causes Behind Rising Stroke Risk in Youth: యువతలో స్ట్రోక్ ముప్పునకు ప్రధాన కారణాలు ఇవే.. లేటెస్ట్ రీసెర్చ్ 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పక్షవాతం స్ట్రోక్ అనగానే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా భావిస్తాం. కానీ, ప్రస్తుత కాలంలో యువతలోనూ ఈ ముప్పు పెరుగుతోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పుట్టినప్పుడు తక్కువ బరువు ఉన్నవారికి, భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశం 21 శాతం ఎక్కువగా ఉంటుందని స్వీడన్‌ పరిశోధకులు గుర్తించారు. ఇస్తాంబుల్‌లో జరిగిన యూరోపియన్ ఒబేసిటీ కాంగ్రెస్ (ECHO 2026) వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

8 లక్షల మందిపై పరిశోధన..

గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 1973-1982 మధ్య జన్మించిన సుమారు 8 లక్షల మంది గణాంకాలను విశ్లేషించారు. 2022 చివరి వరకు వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించగా.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

 సాధారణంగా శిశువు 3.5 కిలోల బరువు ఉండాలి. అంతకంటే తక్కువ బరువుతో పుట్టిన వారిలో స్ట్రోక్ వచ్చే ముప్పు అధికంగా ఉంది. తక్కువ బరువుతో పుట్టిన మహిళల్లో 18 శాతం, పురుషుల్లో 23 శాతం మేర ఈ ప్రమాదం పొంచి ఉందని పరిశోధనలో తేలింది.

 ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ ఆగడం, హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం చిట్లడం.. ఈ రెండు రకాల పక్షవాతాలకూ పుట్టినప్పుడు తక్కువ బరువు ఉండడానికి సంబంధం ఉందని స్పష్టమైంది.

పెరుగుతున్న కేసులు.. కారణాలేంటి..?

అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి దేశాల్లోనూ యువకుల్లో స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా మారుతున్న జీవనశైలి, పర్యావరణ మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగం రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సికిల్ సెల్ ఎనీమియా వంటి జన్యుపరమైన సమస్యలు, రక్తనాళాల బలహీనత కూడా కారణమవుతున్నాయి.

ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం..  

పెద్దయ్యాక వచ్చే పక్షవాతాన్ని నివారించాలంటే చిన్నతనం నుంచే జాగ్రత్తలు అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. రక్తపోటు (BP), మధుమేహం (Sugar) వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు.. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో స్ట్రోక్ రిస్క్ అంచనా వేసేటప్పుడు 'పుట్టినప్పుడు ఉండే  బరువు'ను కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.