మామోగ్రామ్ ఎలాంటి మహిళలు చేయించుకోవాలి..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారు. తీవ్రమైన సమస్యలలో క్యాన్సర్ కూడా ఒకటి. మహిళలకు ఎక్కువగా సోకే రొమ్ము క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణిస్తున్నారు. సకాలంలో గుర్తించగలిగితే ప్రాణనష్టాన్ని నివారించే అవకాశాలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది తీవ్రమైన వ్యాధి. సాధారణంగా మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, సకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా దీనిని నివారించవచ్చు. మామోగ్రఫీ అనేది ఈ వ్యాధిని గుర్తించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఒక పరీక్ష.
ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
అసలు ఏంటీ మామోగ్రఫీ..?
మామోగ్రఫీ అనేది రొమ్ము క్యాన్సర్ ని గుర్తించే పరీక్ష. అయితే దీనిపై కొందరికి అవగాహన లేకపోవడంతో సరైన సమయంలో వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. మామోగ్రామ్ ఎంత అవసరమో..? ఎవరికి అవసరమో..? ఇప్పుడు తెలుసుకుందాం..
మామోగ్రామ్ అనేది ఒక రకమైన రోగనిర్ధారణ పరీక్ష. స్క్రీనింగ్ సాధనం, దీనిలో రొమ్ము ఎక్స్-రే . రొమ్ము క్యాన్సర్ లేదా కణితిని గుర్తించడం జరుగుతుంది. ఈ ప్రక్రియనే "మామోగ్రఫీ" అంటారు.
మామోగ్రఫీ ఎందుకుచేస్తారు..?
ఈ లక్షణాలుంటే ఖచ్చితంగా మామోగ్రఫీ చేయించుకోవాలి..
రొమ్ములో ఏదైనా రకమైన ముద్ద
ఛాతీలో ఏమైనా మార్పులు
చనుమోనల అసాధారణ తీరు...
రొమ్ములో వాపు..
రొమ్ము నొప్పి..
40 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ రెండేళ్లకు ఒకసారి మామోగ్రామ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది సకాలంలో క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. తద్వారా సరైన సమయంలో చికిత్స తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
