యాంటిబయోటిక్ రెసిస్టెన్స్ తో 3.9 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వచ్చే 25 ఏళ్లలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఇన్ఫెక్షన్ కారణంగా 3కోట్ల 9లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం..1990-2021 మధ్య కాలంలో బ్యాక్టీరియాతో సహా యాంటీ బయాటిక్-రెసిస్టెంట్ జెర్మ్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు మరణించారు.

భవిష్యత్తులో భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో కూడిన దక్షిణాసియాపై కూడా తీవ్ర ప్రభావం చూపబోతోందని ఈ నివేదిక హెచ్చరించింది. 2025-2050 మధ్య కాలంలో దక్షిణాసియాలో మొత్తం 1.18 కోట్ల మంది ప్రజలు యాంటీబయాటిక్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్‌ల వల్ల చనిపోయే ప్రమాదం ఉందని గ్రామ్ ప్రాజెక్ట్ (గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్) కు చెందిన  పరిశోధకుల బృందం తెలిపింది.

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

 

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే..?


యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే..? వ్యాధికారక బాక్టీరియాలను చంపడానికి రూపొందించిన మందులు పనికిరావు. వ్యాధికారక క్రిములు ఈ మందులను ఓడించే సామర్థ్యాన్ని పొందడం వల్ల ఈ సంక్షోభం ఏర్పడుతుంది, దక్షిణ,  తూర్పు ఆసియా, సహారా ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కారణంగా మరణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

1990 - 2021 మధ్య కాలంలో 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా మరణాలు 80 శాతానికి పైగా పెరిగాయని అంచనాలు సూచిస్తున్నాయి. ఇది రాబోయే సంవత్సరాల్లో వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే కాలంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా మరణాలు 50 శాతానికి పైగా తగ్గాయని నివేదిక వెల్లడించింది.

 204 దేశాల్లోని అన్ని వయసుల 52 కోట్ల మందిని అధ్యయనం చేశారు. ఆసుపత్రిల్లో చనిపోయిన వారి రికార్డులు, యాంటీబయాటిక్ వినియోగ డేటాతో సహా వివిధ మూలాల నుంచి డేటా సేకరించారు. 2019లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కు సంబంధించిన మరణాలు హెచ్‌ఐవి/ఎయిడ్స్ లేదా మలేరియాతో సంభవించిన వాటి కంటే ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.