Immunotherapy : క్యాన్సర్ రోగుల్లో 'విటమిన్-ఇ'తో అద్భుత ఫలితాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : క్యాన్సర్ చికిత్సలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాణాంతక వ్యాధిపై పోరాడే 'ఇమ్యునోథెరపీ' పనితీరును మెరుగుపరచడంలో 'విటమిన్-ఇ' కీలక పాత్ర పోషిస్తుందని అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఈ తాజా అధ్యయనం వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

క్యాన్సర్ వంటి వ్యాధులకు.. 

సాధారణంగా శరీరంలో ఉండే 'డెన్డ్రిటిక్ కణాలు' (Dendritic cells) క్యాన్సర్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా టీ-కణాలను (T-cells) సిద్ధం చేస్తాయి. అయితే క్యాన్సర్ కణాల ప్రభావం వల్ల ఇవి కొన్నిసార్లు మందగిస్తాయి. విటమిన్-ఇ నేరుగా ఈ డెన్డ్రిటిక్ కణాలపై పని చేసి, వాటిని చురుగ్గా మారుస్తుందని పరిశోధనలో తేలింది. తద్వారా ఇమ్యునోథెరపీ చికిత్స తీసుకునే వారిలో వ్యాధి నయమయ్యే అవకాశాలు మెరుగుపడుతున్నాయి.

పరిశోధనలో తేలిన ప్రధాన అంశాలు..

 మెలనోమా చర్మ క్యాన్సర్, రొమ్ము, కిడ్నీ, పేగు క్యాన్సర్ ఉన్న రోగుల్లో విటమిన్-ఇ తీసుకున్న వారు.. తీసుకోని వారికంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు క్లినికల్ డేటా విశ్లేషణలో వెల్లడైంది. డెన్డ్రిటిక్ కణాల పనితీరును అడ్డుకునే 'SHP-1' అనే ప్రోటీన్‌ను విటమిన్-ఇ నేరుగా కట్టడి చేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడం సులభమవుతుంది. విటమిన్-ఇ ప్రభావంతో టీ-కణాలు మరింత శక్తివంతంగా మారి క్యాన్సర్ గడ్డలపై దాడి చేస్తున్నట్లు ల్యాబొరేటరీ పరీక్షల్లోనూ రుజువైంది.

విప్లవాత్మక మార్పులు..  

ప్రస్తుతం ఇమ్యునోథెరపీ అందరు రోగులకు ఒకేలా ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో, విటమిన్-ఇ ని ఇతర చికిత్సలతో కలిపి ఇవ్వడం లేదా నేరుగా డెన్డ్రిటిక్ కణాలను ఉత్తేజపరిచే కొత్త ఔషధాలను తయారు చేయడం ద్వారా క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రధాన పరిశోధకులు డాక్టర్ షియాంగ్లియాంగ్ యువాన్ పేర్కొన్నారు. ఆహార సంబంధిత విటమిన్ల ద్వారా చికిత్సను మెరుగుపరచడం తక్కువ ఖర్చుతో కూడిన మార్గమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.