2141-V11 ఔషధం : క్యాన్సర్ చికిత్సకు సరికొత్త ఔషధం..  

సాక్షి లైఫ్ : క్యాన్సర్ పేరు వినగానే చాలా మంది ప్రాణాంతకమైన వ్యాధి అని చాలామంది భయపడతారు. కానీ ఇప్పుడు ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పరిశోధకులు సరికొత్త ఔషధాన్ని రూపొందించి ప్రయోగించి చూశారు. దీంతో మంచి సత్ఫాలితాలు వచ్చాయి. ఇటీవల జరిగిన క్లినికల్ ట్రయల్‌లో ఇమ్యునోథెరపీ ఔషధం క్యాన్సర్ కణితులు పూర్తిగా నయమయ్యాయి. 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

 
క్యాన్సర్ నేడు ప్రపంచంలో తీవ్రమైన వ్యాధుల్లో ఒకటి. కీమోథెరపీ ,రేడియేషన్ వంటి సాంప్రదాయ చికిత్సలు క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటుండగా, అవి తరచుగా శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు కూడా హాని కలిగిస్తున్నాయి. అందుకోసమే శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్సా పద్ధతి - ఇమ్యునోథెరపీని ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు వారు చెబుతున్నారు.  

అసలేంటీ ఇమ్యునోథెరపీ..?

ఇమ్యునోథెరపీ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి, క్యాన్సర్‌ కణాలను నిరోధించడానికి చేసే చికిత్స. ఇది క్యాన్సర్ కణాలపై నేరుగా దాడి చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలకు తక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇటీవల అధునాతన ఇమ్యునోథెరపీ ఆశ్చర్యకరమైన ఫలితాలను చూపించింది.

కొత్త ఔషధం నుంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు..  

క్యాన్సర్ కణుతులను నిరోధించడానికి శాస్త్రవేత్తలు CD40 అగోనిస్ట్ యాంటీబాడీస్ అనే కొత్త వెర్షన్ ఔషధాలను అభివృద్ధి చేశారు. మునుపటి ట్రయల్స్‌లో, ఈ మందులు క్యాన్సర్ కణాలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉన్నాయి, కానీ అవి కాలేయంపై చెడు ప్రభావం చూపించడంతోపాటు, ప్రమాదకరమైన దుష్ప్రభావాలు కూడా కలిగి ఉన్నాయి.

అయితే ఈ సవాలును దృష్టిలో ఉంచుకుని, 2018లో అమెరికాలోని రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయ బృందం దాని అధునాతన రూపాన్ని అభివృద్ధి చేసింది. 2141-V11 అనే కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్ మొదటి దశలో చాలా సానుకూల ఫలితాలను ఇచ్చింది.

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : cancer-treatment cancer-risk treatment-for-oral-cancer oncology breakthrough-treatment medical-breakthrough oncology-research clinical-trials immunotherapy 2141-v11 cd40-agonist-antibodies breakthrough
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com