Incorrect Treatment in India : దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి తప్పుడు చికిత్స.. ఐసీయూల్లో ఇంకా దారుణం.. తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలు..
సాక్షి లైఫ్ : ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఆసుపత్రికి వెళ్తే ప్రాణం నిలుస్తుందన్న నమ్మకం.. కానీ అక్కడ జరిగే చిన్న పొరపాట్లు రోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. భారత్‌లోని ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రతి ముగ్గురు రోగులలో ఒకరు ఏదో ఒక రూపంలో 'మందుల పొరపాట్ల' (Medication Errors)కు గురవుతున్నారని తాజాగా వెల్లడైన ఓ పరిశోధన విస్మయం కలిగిస్తోంది.
ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్త ఆసుపత్రుల్లో మందుల వాడకంలో జరుగుతున్న లోపాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. 2014 నుంచి 2025 ఏప్రిల్ వరకు సుమారు 3 లక్షల మంది రోగులపై జరిగిన 40 రకాల పరిశోధనలను విశ్లేషించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?
ఎక్కడ చూసినా ముప్పే..!
ఆసుపత్రుల్లోని వివిధ విభాగాలను పరిశీలిస్తే, అత్యవసర చికిత్స అందించే చోటే ప్రమాదాలు ఎక్కువగా పొంచి ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా 74 శాతం వరకు మందుల పొరపాట్లు జరుగుతున్నాయి. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురికి తప్పుడు డోసు లేదా తప్పుడు మందు అందుతోంది.
ప్రాణాపాయ స్థితిలో ఉండేవారికి ఇచ్చే మందుల్లో సగటున 36.53 శాతం తప్పులు దొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఇది 43 శాతానికి పైగా ఉంది. ఇక్కడ చేరిన రోగులలో దాదాపు 40 శాతం మంది ఈ పొరపాట్ల బారిన పడుతున్నారు.
పొరపాటు ఎక్కడ జరుగుతోంది..?
వైద్యుడు మందు రాసినప్పటి నుంచి రోగికి వేసే వరకు నాలుగు దశల్లో ఈ లోపాలు దొర్లుతున్నాయని నిపుణులు గుర్తించారు. ప్రిస్క్రిప్షన్ 40శాతం.. అత్యధిక పొరపాట్లు డాక్టర్లు మందులు రాసేప్పుడే జరుగుతున్నాయి. తప్పుడు మందు పేరు రాయడం, డోసు సరిగ్గా పేర్కొనకపోవడం ప్రధాన కారణాలు. అడ్మినిస్ట్రేషన్ 31శాతం.. నర్సులు లేదా సిబ్బంది రోగికి మందు ఇచ్చే సమయంలో సమయం పాటించకపోవడం, ఇంజెక్షన్ ఇచ్చే పద్ధతిలో లోపాలు ఉండటం. ట్రాన్స్‌క్రిప్షన్ 22శాతం.. డాక్టర్ రాసిన మందులను రికార్డుల్లోకి ఎక్కించే సమయంలో జరిగే రాత తప్పులు.
డిస్పెన్సింగ్ 11శాతం.. ఫార్మసీలో మందులు ఇచ్చేటప్పుడు జరిగే పొరపాట్లు.
ప్రాణాల మీదకు..
ఈ పొరపాట్లు అన్నీ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ, 8.9 శాతం కేసుల్లో రోగిని నిరంతరం పర్యవేక్షించాల్సి వస్తోంది. సుమారు 2.2 శాతం మందికి తప్పుడు మందుల వల్ల తలెత్తిన సమస్యల నివారణకు అదనపు చికిత్స అవసరమవుతోంది. 1.2 శాతం వరకు రోగులు ఈ కారణాల వల్ల ఆసుపత్రిలో ఎక్కువ రోజులు గడపాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి పొరపాట్లలో సగానికి పైగా నివారించదగినవే కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..Ajna Chakra : ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి..?
ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..??
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
