గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార సమతుల్యత దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఇవే..
సాక్షి లైఫ్ : పోషకాహార సమతుల్యత దెబ్బతినడానికి ప్రధాన కారణాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా పరిశోధకులు రీసెర్చ్ చేశారు. అందులో భాగంగా దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది జిల్లాలను విశ్లేషించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆహారం ప్రధానంగా బియ్యం, గోధుమలు వంటి తృణధాన్యాలపై ఆధారపడి ఉంటుందని వారు ఈ అధ్యయనంలో కనుగొన్నారు.
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..వేసవికాలంలో మూత్రపిండాల్లో రాళ్లకు ఐదు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇవి వారి రోజువారీ ప్రోటీన్ తీసుకోవడంలో 60 నుంచి 75 శాతం దోహదం చేస్తాయి. అయితే శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కలిగి ఉండవని, దీని కారణంగా పోషకాల సమతుల్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-అరిడ్ ట్రాపిక్స్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ శాస్త్రవేత్తలు ఆరు రాష్ట్రాల్లోని తొమ్మిది జిల్లాలను విశ్లేషించారు. గ్రామస్తుల ఆహారం ప్రధానంగా బియ్యం, గోధుమలు వంటి తృణధాన్యాలపై ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు. అయితే, అవి శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉండవు, దీని కారణంగా పోషక సమతుల్యత ప్రభావితమవుతుంది.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ సమతుల్య ఆహారం తీసుకోవడం లేదు. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం సరిగా తీసుకోవడం లేదు. కొన్ని సందర్భాలను మినహాయించి, గ్రామీణ ప్రజలు పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు , మాంసం వంటి తగినంత ప్రోటీన్ ఫుడ్స్‌ను తీసుకోవడం లేదు. అవగాహన లేకపోవడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్‌ను కూడా తీసుకోవడం లేదు.
ఆరోగ్యకరమైన ఆహారంలో 20 నుంచి 25 శాతం ప్రోటీన్, దాదాపు 65 శాతం కార్బోహైడ్రేట్లు, 10 నుంచి 15 శాతం కొవ్వు పదార్థాలు ఉండాలి. ప్రోటీన్ మన శరీరానికి అవసరమైన పోషకం, ఇది కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు, కణాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఎంజైములు, హార్మోన్లు ఇతర శరీర విధులకు కూడా ఎంతో అవసరం. ప్రోటీన్ లోపం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల, ప్రతిరోజూ ఆహారంలో సరైన మొత్తంలో ప్రోటీన్‌ను చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
