Bedtime Habits : నిద్రించేటప్పుడు..ఈ అలవాట్లే దీర్ఘకాలిక సమస్యలకు మూలం..!

షేర్ చేయండి:
Bedtime Habits : నిద్రించేటప్పుడు..ఈ అలవాట్లే దీర్ఘకాలిక సమస్యలకు మూలం..!

సాక్షి లైఫ్ : రోజంతా కష్టపడి రాత్రి హాయిగా నిద్రపోతే ఉదయానికి ఉత్సాహంగా ఉండాలి. కానీ, చాలామంది నిద్రలేవగానే మెడ పట్టేయడం, భుజాల నొప్పి లేదా తీవ్రమైన నడుము నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. దీనికి పని ఒత్తిడి కారణమని సరిపెట్టుకుంటారు. అయితే, అసలు సమస్య మీ నిద్రలోనే దాగి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం నిద్రించే 6 నుండి 8 గంటల సమయం మన వెన్నెముక, కండరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

భంగిమ సరైనదేనా..?

నిద్రించే విధానం (Sleep Position) కేవలం సౌకర్యం కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ముఖ్యమే. ఇది అత్యంత ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల వెన్నెముక సమాంతరంగా ఉండి, మెడపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా, గురక, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

వెల్లకిలా పడుకోవడం..

నడుము నొప్పి ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. అయితే, తల కింద ఎత్తైన దిండు కాకుండా మధ్యస్థంగా ఉన్నది ఎంచుకోవాలి. మోకాళ్ల కింద చిన్న దిండు పెట్టుకుంటే నడుముకు మరింత సపోర్ట్ లభిస్తుంది.

బోర్లా పడుకోవడం..

ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. దీనివల్ల మెడ వంకరగా తిరిగి, వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది దీర్ఘకాలంలో మెడ నొప్పులకు దారితీస్తుంది.

జాగ్రత్త పడాలి.. 

మెడ నొప్పి కేవలం కండరాలకే పరిమితం కాకుండా నరాలపై ప్రభావం చూపవచ్చు.మెడ నొప్పి వల్ల తలనొప్పి (Cervicogenic headache) వచ్చే అవకాశం ఉంది.చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు రావడం నరాల నొక్కుకుపోవడానికి సంకేతం కావచ్చు. ఉదయం నిద్రలేవగానే 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం కండరాలు బిగుసుకుపోయి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు.

దిండు.. పరుపు.. రెండూ ముఖ్యమే కానీ..!

చాలామంది చాలా మెత్తటి లేదా మరీ గట్టి పరుపులపై పడుకుంటారు. కానీ, వెన్నెముక సహజ ఆకృతిని కాపాడే విధంగా మధ్యస్థంగా ఉండే పరుపు, దిండును ఎంచుకోవడం శ్రేయస్కరం. దిండు మరీ ఎత్తుగా ఉంటే మెడ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. నిద్రించే సమయంలో తల, భుజాలు, నడుము ఒకే వరుసలో (Neutral Spine) ఉండేలా చూసుకోవాలి. సరైన భంగిమలో నిద్రిస్తేనే మీ వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుందని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.