ఇలా చేస్తే ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.. 

సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే కొన్నిరకాల జాగ్రత్తలు అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఉదయం నిద్రలేచిన తర్వాత చప్పట్లు కొట్టాలని వారు సూచిస్తున్నారు. తద్వారా సిరల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, ఆర్థరైటిస్ ప్రమాదం కూడా తగ్గుతుందని వారు వెల్లడిస్తున్నారు. రోజుకు 300 నుంచి 400 సార్లు చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక అధ్యయనాలు సైతం చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి.. ఈ వైరస్‌లు.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి..  

 క్లాపింగ్ థెరపీ..  

మెడ గట్టిపడితే క్లాపింగ్ థెరపీ చికిత్స చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కండరాలలో రక్త ప్రసరణను పెంచడంవల్ల మెడ నొప్పితోపాటు వెన్ను నొప్పికి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాదు, రక్తపోటు, ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి క్లాపింగ్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. 

వయస్సు పైబడుతున్న కొద్దీ పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తు తుంటాయి. ముఖ్యంగా ఒత్తిడి అనేక మానసిక సమస్యలకు కారణమ వుతుంది. కాబట్టి మెంటల్ హెల్త్ ను కాపాడుకోవడానికి చప్పట్లు కొట్టడం వంటి కార్యకలాపాలను దినచర్యలో చేర్చుకోవడం ఉత్తమమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

-ఉదయం నిద్రలేచిన తర్వాత చప్పట్లు కొట్టడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

-క్లాపింగ్ థెరపీ సహాయంతో లో బీపీ నుంచి ఉపశమనం పొందవచ్చు.

-మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

గుండె.. 

చప్పట్లు కొట్టడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. క్లాపింగ్ థెరపీ చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు గుండె, కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

జుట్టు రాలడం..

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి కూడా చప్పట్లు కొట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేతుల్లోని ఈ రాపిడి వల్ల తలపై వెంట్రుకలు కూడా చాలా ప్రయోజనం పొందుతాయని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే చేతులలోని నరాలు నేరుగా మెదడుతో అనుసంధానమై ఉంటాయి.

చప్పట్లు కొట్టడానికి సరైన మార్గం ఏమిటి..?

క్లాప్పింగ్ థెరపీ పూర్తి ప్రయోజనాలను పొందడానికి.. దాని సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదయాన్నే నిద్రలేచి, ఆపై నడుము నిటారుగా ఉంచి, శరీరాన్ని పైకి లాగి చప్పట్లు కొట్టాలి. ఈ సమయంలో సౌలభ్యం ప్రకారం మధ్యలో కొంత విరామం తీసుకోవచ్చు. అలాగే, చప్పట్లు కొట్టే ముందు అరచేతులపై కొంచెం నూనెను రాసుకుంటే  మనస్సును రిలాక్స్ చేయడంలో చాలా సహాయపడుతుంది.

 ఇది కూడా చదవండి.. దంతాల పొడవు తగ్గించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?

 

ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : arthritis-pain arthritis symptoms-of-rheumatoid-arthritis clapping-health-benefits clapping-therapy clapping-therapy-health-benefits clapping-therapy-benefits

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com