ఐటీ ఉద్యోగుల్లో 80శాతం మందికి ఫ్యాటి లివర్ సమస్య..! కారణాలు ఏమిటంటే..?  

 

సాక్షి లైఫ్ : ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా ఐటీ ఉద్యోగుల్లో లివర్ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 80శాతం మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటి లివర్ సమస్యతో బాధపడు తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫ్యాటి లివర్ అనేది లివర్‌లో కొవ్వు అధికంగా పేరుకుపోయి, కాలేయ పనితీరును ప్రభావితం చేసే పరిస్థితి.

తాజా పరిశోధన : ఫ్యాటి లివర్ నివారణకు మందులతో పనిలేకుండా ఏం చేస్తే సరిపోతుంది..?

ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి.. 

విటమిన్ "డి" తగ్గిపోవడానికి ఆరు కారణాలు.. 

ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది, ముఖ్యంగా జీవనశైలి సరిగా లేకపోవడం, అధిక సమయం కూర్చొని పని చేయడం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి, కాబట్టి దీని నివారణ కోసం సరైన జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమ అనేవి తప్పనిసరి. 


-ఆధునిక జీవనశైలి కారణంగా ఐటీ ఉద్యోగుల్లో లివర్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.
- జీవనశైలిసరిగా లేకపోవడం, రోజంతా కూర్చొని పని చేయడం, - అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా 80శాతంపైగా ఐటీ ఉద్యోగులు ఫ్యాటి లివర్ (Fatty Liver) సమస్యతో బాధపడుతున్నారు.

ఫ్యాటి లివర్ అంటే..?

లివర్‌లో కొవ్వు అధికంగా పేరుకుపోయి, లివర్ పనితీరును దెబ్బతీసే స్థితిని ఫ్యాటి లివర్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది:
-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ (Alcoholic Fatty Liver) – మద్యం ఎక్కువగా తాగేవారిలో కనిపిస్తుంది.
-నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ (NAFLD) – మద్యం సేవించనివారిలో కూడా లైఫ్‌స్టైల్ కారణంగా ఏర్పడుతుంది.

ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటి లివర్ ఎక్కువగా ఎందుకు వస్తోంది..?


 ముఖ్య కారణాలు.. 


- సుదీర్ఘంగా కుర్చొని పని చేయడం – రోజుకు 8-10 గంటలపాటు కంప్యూటర్ ముందు కూర్చోవడం శరీర చలనం తగ్గించి లివర్‌పై ఒత్తిడి పెంచుతుంది.
- అనారోగ్యకరమైన ఆహారం – జంక్ ఫుడ్, ఎక్కువగా కొవ్వు, షుగర్ ఉండే ఆహారం తీసుకోవడం.
- శారీరక శ్రమ లేకపోవడం – రెగ్యులర్ ఫిట్‌నెస్ లేకపోవడంతో లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది.
- స్ట్రెస్ , నిద్రలేమి – ఒత్తిడి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లివర్ పనితీరుపై ప్రభావం పడుతుంది.
- డయాబెటిస్ & మెటాబోలిక్ సిండ్రోమ్ – అధిక బరువు ఫ్యాటి లివర్‌కు కారణమవుతుంది.

 

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : eating-habits sedentary-lifestyle obesity-problems obesity healthy-lifestyle food-habits good-habits fatty-liver fatty-liver-symptoms obesity-research fatty-liver-diet fatty-liver-disease fatty-liver-treatment how-to-cure-fatty-liver reverse-fatty-liver best-drink-for-fatty-liver remedies-for-a-fatty-liver fatty-liver-diet-plan symptoms-of-fatty-liver what-are-the-best-fruits-for-fatty-liver? what-causes-fatty-liver nonalcoholic-fatty-liver-disease non-alcoholic-fatty-liver-disease what-is-fatty-liver fatty-liver-causes how-to-detox-your-fatty-liver childhood-obesity it-professionals it-employees hyderabad-it-employees
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com