రోజుకు 4,500కంటే ఎక్కువ అడుగులు నడిచే వ్యక్తులకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ.. 

సాక్షి లైఫ్: నడకతో ఆరోగ్య ప్రయోజనాలున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు.. శారీరక శ్రమకు నడకను ఒక మార్గంగా ఎంచుకోవడంలో ఇంకో లాభమూ ఉంది. ఆరోగ్య పరిరక్షణ కోసం మనం చేస్తున్న ప్రయత్నాల్లో సులువుగా కొలవదగ్గ చర్య ఈ నడక అంటున్నారు అలబామా విశ్వవిద్యాలయపు బర్మింగ్‌హామ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ ఎపిడెమియాలజీ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎరిన్ డూలీ అంటున్నారు. "ఇది (నడక) కొలిచేందుకు సులభమైన,ప్రభావవంతమైన చర్య,  ప్రతిరోజూ తీసుకునే చర్యలలో వచ్చే చిన్న మార్పు కూడా మన గుండెకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మేము గుర్తించాము." అని ఎరిన్ డూలీ తెలిపారు.

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 

వృద్ధులు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే నడక మేలైన మార్గం. దినచర్యల్లో భాగంగా ఉండే నడకకు అదనంగా కనీసం ఐదు వందల అడుగుల దూరం నడవగలిగితే గుండెజబ్బులు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించుకోవచ్చునని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఎపిడిమియాలజీ, ప్రివెన్షన్‌, లైఫ్‌స్టైల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది.

అధ్యయనంలో.. 

నడక ప్రభావాన్ని గుర్తించేందుకు డాక్టర్ డూలీ నేతృత్వంలో చేపట్టిన అధ్యయనంలో భాగంగా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న 452 మంది సమాచారాన్ని పరిశీలించారు.  వీరందరూ రోజువారీ నడక దశలను కొలిచే ట్రాకింగ్ పరికరాన్ని ధరించిన వారే.  వారు  సగటున రోజుకు 3,500 అడుగులు వేశారు.

సుమారు మూడున్నరేళ్ల సమయం పరిశోధకులు  వారి నడకను పరిశీలించారు. ఈ కాలంలో 7.5 శాతం మంది గుండె జబ్బులు, గుండెపోటు లేదా గుండెకు సంబంధించిన సమస్యలను అనుభవించారు. ఫలితాలు ట్రాక్ చేసిన శారీరక శ్రమ, గుండె ఆరోగ్యం మధ్య బలమైన సంబంధాన్ని చూపించాయి.

రోజుకు 2,000 అడుగుల కంటే తక్కువ నడిచే వృద్ధులతో పోలిస్తే రోజుకు 4,500 లేదా అంతకంటే ఎక్కువ అడుగులు నడిచే వ్యక్తులకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 77 శాతం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. ప్రతి అదనపు 500 అడుగులు గుండె జబ్బుల ప్రమాదాన్ని 14 శాతం తగ్గిస్తాయని పరిశోధకులు గుర్తించారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం 6 లక్షల 97వేల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ప్రతి 5 మరణాలలో ఒకరు గుండె జబ్బుల కారణంగానే చనిపోతున్నారు.

గుండె జబ్బులకు వయస్సు ఒక ప్రధాన ప్రమాద కారకం అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (NIA), 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు హార్ట్ అటాక్ , హార్ట్ స్ట్రోక్,  హార్ట్ ఫెయిల్యూర్ తో సహా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వృద్ధాప్యం. దీని కారణంగా, గుండె రక్త నాళాలలో మార్పులు సంభవిస్తాయి.

"వృద్ధులకు గుండె రక్త నాళాలు బిరుసుగా మారతాయని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల అవయవాలకు రక్త ప్రవాహం తగ్గుతుందని, అంతేకాకుండా అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచడంతోపాటు ఇది గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడాలి. అదే సమయంలో గుండె కండరాలు బలహీనంగా మారవచ్చు లేదా దెబ్బతినవచ్చు, ఈ పరిస్థితి గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

  శారీరక శ్రమ ఎంత అవసరం.. ?

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..? ధూమపానం చేయకూడదు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, వయస్సుకు సరిపడా బరువు ఉండాలి. శారీరక శ్రమ చేయాలి. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా వారి రక్తపోటు, కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. వృద్ధులు రోజుకు 10వేల అడుగులు నడవాలని సిఫార్సు చేస్తున్నారు పరిశోధకులు.

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : heart-attack heart-risk heart heart-health heart-blocks heart-problems heart-related-problems heart-disease heart-diseases heart-failure heart-surgery risk-of-heart-disease habits-bad-for-heart healthy-heart-habits heart-disease-women
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com