BP Medicines Fail Quality Tests : నాణ్యతా పరీక్షల్లో విఫలమైన బీపీ మందులు..! కలవరపెడుతున్న సీడీఎస్‌సీఓ నివేదిక..
సాక్షి లైఫ్ : రక్తపోటు (blood pressure) నియంత్రణ కోసం రోజూ వేసుకునే మందులే కదా అని ధీమాగా ఉన్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న పలు బీపీ మందులు నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనట్లు ప్రభుత్వ తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్న 'టెల్మిసార్టన్'తో పాటు మరికొన్ని కీలక ఔషధాల బ్యాచ్‌లు నాసిరకమని తేలడం రోగులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
లోపాలు ఏంటి..?
భారత ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నిర్వహించిన తనిఖీల్లో సుమారు పదికి పైగా కంపెనీల ఉత్పత్తులు 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ' (NSQ) గా తేలాయి. ఈ మందుల్లో ప్రధానంగా రెండు రకాల లోపాలను గుర్తించారు. మనం వేసుకున్న మాత్ర శరీరంలోకి వెళ్ళాక నిర్ణీత సమయంలో కరగాలి. అప్పుడే అది రక్తంలో కలిసి పని చేస్తుంది. కానీ పరీక్షల్లో విఫలమైన ఈ మాత్రలు శరీరంలో సరిగ్గా కరగడం లేదని తేలింది. మాత్రలో ఉండాల్సిన అసలైన మందు (Active Ingredient) నిర్ణీత పరిమాణం కంటే తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం.
ఇతర మందులపైనా తీవ్ర ప్రభావం..!
కేవలం టెల్మిసార్టన్ మాత్రమే కాకుండా.. ఎనలాప్రిల్, అటెనోలాల్, మెటోప్రోలాల్, లాబెటలాల్ వంటి మరికొన్ని రక్తపోటు మందుల బ్యాచ్‌లు కూడా నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి. వేర్వేరు తయారీదారులు ఉత్పత్తి చేసిన ఈ మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
'నిశ్శబ్ద' ప్రమాదం..
ఈ నాసిరకం మందుల వల్ల తక్షణమే ఎలాంటి దుష్ప్రభావాలు (Side effects) కనిపించవు. కానీ, మందు వేసుకుంటున్నా రక్తపోటు అదుపులోకి రాదు. లోపల బీపీ పెరుగుతున్న విషయం రోగికి తెలియదు. దీనివల్ల ఎటువంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attack) లేదా పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ చర్యలు..
నాణ్యత లేని ఆయా బ్యాచ్‌ల మందులను మార్కెట్ నుంచి తక్షణమే వెనక్కి పిలిపించాలని (Recall) సీడీఎస్‌సీఓ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నమ్మకమైన ఫార్మసీలు: మందులను కేవలం గుర్తింపు పొందిన, పేరున్న మెడికల్ షాపుల్లోనే కొనుగోలు చేయండి. మందులు కొన్నప్పుడు తప్పనిసరిగా బ్యాచ్ నంబర్ ఉండేలా బిల్లు తీసుకోండి. మందులు వాడుతున్నప్పటికీ, ఇంట్లోనే తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండండి. రీడింగ్స్‌లో అసాధారణ మార్పులు ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించండి. వార్తలు చూసి కంగారుతో మందులు ఆపేయకండి. మీ మందుల బ్రాండ్ గురించి సందేహం ఉంటే మీ డాక్టర్ ను సంప్రదించండి. మీ వద్ద ఉన్న మందుల బ్యాచ్ నంబర్లను సీడీఎస్‌సీఓ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించిన జాబితాతో సరిచూసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
