కొత్త ఔషధంతో ఎబోలా వైరస్‌ మటాష్.. కోతులపై విజయవంతమైన ప్రయోగం.. 

సాక్షి లైఫ్ : ఎబోలా వైరస్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. ఇది ప్రాణాంతకమైనది. ఎబోలా బారిన పడిన కోతులపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. ప్రత్యేక మాత్రతో విజయవంతంగా చికిత్స చేయవచ్చని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో ఈ ప్రాణాంతక వైరస్‌ నుంచి బయట పడొచ్చని పరిశోధకులు చెబుతున్నారు..  

 

ఇది కూడా చదవండి.. ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

ఇది కూడా చదవండి.. ఆయుర్వేదం చికిత్స రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా ఎలా సమతుల్యం చేస్తుంది..?

 

ఎబోలా వైరస్‌ ను నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలు ఓ ఔషధాన్ని రూపొందించారు. దీనిని కోతులపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఔషధం శరీరంలోకి ప్రవేశించి వైరస్ పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయ వైద్య శాఖకు చెందిన వైరాలజిస్ట్ థామస్ గీస్‌బర్ట్, అతని బృందం చేసిన ఈ అధ్యయనాన్ని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.

వారు ఎబోలా వైరస్ చికిత్సకు ఓంబాల్డెసివిర్ అనే యాంటీవైరల్ ఔషధాన్ని పరీక్షించారు. ఈ ఔషధం రెమ్‌డెసివిర్ కు సంబంధించింది. దీనిని మొదట కోవిడ్-19 చికిత్స కోసం అభివృద్ధి చేశారు.

పరిశోధకులు రీసస్ మకాక్, సైనోమోల్గస్ మకాక్ జాతుల కోతులకు ఎబోలా వైరస్ మకోనా వేరియంట్ అధిక మోతాదులతో సోకింది. దీని తరువాత, ప్రతిరోజూ 10 కోతులకు ఓంబాల్డెసివిర్ మాత్రలు ఇవ్వగా, మూడు కోతులకు ఎటువంటి చికిత్స ఇవ్వకపోవడంతో అవన్నీ చనిపోయాయి.

ఎంత ప్రభావవంతంగా ఉంది..?

80శాతం సైనోమోల్గస్ మకాక్ కోతులు ఆ వైరస్ నుంచి బయటపడ్డాయి. మానవుల జన్యువులకు దగ్గరగా ఉన్న 100శాతం రీసస్ మకాక్ కోతులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. ఈ అధ్యయనంలో తక్కువ సంఖ్య కోతులను ఉపయోగించినప్పటికీ, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. వాటి గణాంకాలు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పరీక్షలో, కోతులకు మానవులకు ప్రాణాంతకమని భావించే మోతాదు కంటే 30వేల రెట్లు ఎక్కువ వైరస్ ఇచ్చారు, అయినప్పటికీ ఆ ఔషధం వాటిని కాపాడింది.

 

ఇది కూడా చదవండి.. శాకాహారులకు మెదడు పనితీరును పెంచే ఆహారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు.. 

ఇది కూడా చదవండి..డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : ebola-virus viral-detection deadliest-pandemics-in-the-world life-saving-treatment life-saving-test ombaldesivir rhesus-macaque cynomolgus-macaque viral-treatment virus-cure antiviral-drug ebola-research breakthrough-treatment scientific-discovery life-saving-medicine pandemic-research
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com