Infertility Issues : అలాంటి ఫుడ్ తీసుకుంటే.. సంతానలేమి సమస్యలు..! : నెదర్లాండ్స్ పరిశోధకులు
సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో 'రెడీ-టు-ఈట్' ఆహార సంస్కృతి పెరిగిపోయింది. సమయం లేకనో, రుచికి అలవాటు పడో చాలామంది ప్యాక్ చేసిన స్నాక్స్, శీతల పానీయాలపై ఆధార పడుతున్నారు. అయితే, ఈ అలవాటు కేవలం స్థూలకాయానికే కాదు.. పురుషుల సంతానోత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నెదర్లాండ్స్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
డచ్ పరిశోధనలో సంచలన నిజాలు..
ఆధునిక ఆహారపు అలవాట్లు, సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై నెదర్లాండ్స్‌కు చెందిన డాక్టర్ రోమీ గైలార్డ్ బృందం కీలక అధ్యయనం చేపట్టింది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో సుమారు 831 మంది మహిళలు, 651 మంది పురుషుల ఆహారపు అలవాట్లను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో తేలిన కొన్ని ముఖ్యాంశాలు ఇవే:
అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం..
మహిళల సగటు ఆహారంలో 22 శాతం, పురుషుల ఆహారంలో 25 శాతం వరకు జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ ఉంటున్నాయి. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని (Ultra-processed foods) తీసుకునే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. దీనివల్ల భాగస్వామి గర్భం దాల్చడానికి పట్టే సమయం సాధారణం కంటే పెరుగుతోంది.
మహిళల్లో పిండం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం..
మహిళల విషయంలో ఈ ఆహారం నేరుగా గర్భధారణను అడ్డుకోక పోయినా, పిండం (Embryo) పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పరిశోధన తేల్చింది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే మహిళల్లో 'పచ్చసంచి' (Yolk Sac) పరిమాణం చిన్నదిగా మారుతున్నట్లు గుర్తించారు. తొలి దశలో పిండానికి పోషణను అందించే ఈ సంచి చిన్నదిగా ఉండటం వల్ల శిశువు ఎదుగుదల మందగించే ప్రమాదం ఉంది.
సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిప్స్, ప్యాక్ చేసిన కేకులు, బిస్కెట్లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలను నియంత్రించాలి.తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. శారీరక శ్రమ, సరైన బరువు నిర్వహణ సంతానోత్పత్తి అవకాశాలను మెరుగుపరుస్తాయి.
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
