డయాబెటిస్ కేసులు పెరాగడానికి డిజిటల్ జీవనశైలే కారణం..
సాక్షి లైఫ్ : డయాబెటిస్ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి కాదు. యువతలో సైతం ఈ కేసులు మరింతగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యమే అసలైన సంపద అనే స్లోగన్ పై నేటితరం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎదుకంటే డిజిటల్ యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మరింది. డిజిటల్ జీవన శైలి కారణంగా మధుమేహ సమస్య బారీన ఎక్కువగా పడుతున్నారు. అయితే చిన్న చిన్న మార్పులతో డయాబెటిస్ కు దూరంగా ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న 6 సూపర్‌ఫుడ్స్..
ఇది కూడా చదవండి..High cholesterol : అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించే 5 కూరగాయలు..
ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..?
ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనంలో ఆన్‌లైన్‌లో డయాబెటిస్ గురించి సెర్చ్ చేసే వారిలో 48శాతం మంది జనరేషన్ జెడ్ (18-24 ఏళ్ల వయసు ఉన్న) వారేనని తేలింది. ముఖ్యంగా వీరిలో డయాబెటిస్ పట్ల ఆందోళన పెరగడానికి డిజిటల్ జీవనశైలే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ జీవనశైలి ప్రభావం..
స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో గంటల తరబడి గడపడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడంతోపాటు అనారోగ్య కరమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు యువతలో డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. "స్క్రీన్ టైమ్ పెరగడం, ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్‌పై ఆధారపడటం వంటివి ఈ వ్యాధికి దారితీస్తున్నాయి," అని ఎండోక్రైనాలజిస్టులు అంటున్నారు.
ఆందోళనకరమైన గణాంకాలు..
తాజా నివేదిక ప్రకారం భారత్దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. జనరేషన్ జెడ్ లో ఈ వ్యాధి గురించి అవగాహన ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వారు తక్కువగా ఉన్నారు. యువత ఆన్‌లైన్‌లో సమాచారం కోసం వెతుకుతోంది, కానీ ఆచరణలో మార్పు చేసుకోవడం లేదు," అని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివారణ మార్గాలు ఏంటి..?
డయాబెటిస్ నివారణకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.. క్రమం తప్పకుండా వ్యాయామం..రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా జిమ్ తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహారం..ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. స్క్రీన్ టైమ్ తగ్గించాలి.. రాత్రిపూట ఫోన్ వాడకాన్ని తగ్గించి, సరిపడా నిద్ర పోవాలి. రెగ్యులర్ చెకప్‌లు.. రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.
ఇది కూడా చదవండి..Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..?
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
