ICMR : బరువు తగ్గడానికి ఏ పద్ధతి ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు నడుం బిగించిన ఐసీఎమ్ఆర్..
సాక్షి లైఫ్ : దేశంలో ఊబకాయం మహమ్మారిలా విస్తరిస్తోంది. ఒకప్పుడు సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ సమస్య, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ పాకింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి నలుగురు పెద్దల్లో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, బరువు తగ్గడానికి అసలు ఏ పద్ధతి ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) నడుం బిగించింది.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
పరిశోధన ప్రధాన ఉద్దేశాలు..
దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న బరువు తగ్గింపు అధ్యయనాలను క్రోడీకరించి, ఒక భారీ విశ్లేషణ చేపట్టాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఏది మేలు..? కేవలం డైటింగ్ సరిపోతుందా..? వ్యాయామం తోడవ్వాలా..? లేదా ప్రవర్తనా మార్పులు (Behavioral changes) అవసరమా..? అన్న కోణంలో పరిశోధనలు జరగనున్నాయి.
అందరికీ ఒకేలా ఉండదు..
ఒకరికి పనిచేసిన డైట్ ప్లాన్ మరొకరికి ఎందుకు పనిచేయదు..? వయసు, లింగం, ఆదాయం, నివసించే ప్రాంతాన్ని బట్టి ఫలితాలు ఎలా మారుతున్నాయి..? అనే అంశాలను విశ్లేషించనున్నారు. ఈ విశ్లేషణలో కేవలం కిలోల లెక్క మాత్రమే కాకుండా.. రక్తపోటు (BP), రక్తంలో చక్కెర స్థాయిలు (Diabetes), కొలెస్ట్రాల్‌పై ఆయా పద్ధతుల ప్రభావం ఎలా ఉందో కూడా గమనిస్తారు.
వింత పోకడలు.. కొత్త సవాళ్లు..!
ప్రస్తుత కాలంలో బరువు ఒక్కటే ఆరోగ్యానికి కొలమానం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "చూడటానికి సన్నగా ఉన్నా లోపల మెటబాలిక్ సమస్యలు (Thin-fat India) ఉండటం, మరికొందరు లావుగా ఉన్నా తక్షణ ఆరోగ్య సమస్యలు లేకపోవడం వంటి విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావలసిన అవసరం ఉంది." గ్రామీణ భారతం కూడా ఈ ముప్పులో ఉండటం విశేషం. ఒకవైపు పోషకాహార లోపం వేధిస్తుంటే, మరోవైపు అదే ప్రాంతాల్లో ఊబకాయం పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
భవిష్యత్ కార్యాచరణ..
ఈ భారీ అధ్యయనం ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా, భారతీయుల శరీర తత్వానికి సరిపోయే 'ఇండియా-స్పెసిఫిక్' చికిత్స మార్గదర్శకాలను (Guidelines) రూపొందించనున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో జీవనశైలి వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ప్రణాళిక లభించనుంది.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
