ప్లాస్టిక్ కంటే గాజు సీసాలే ప్రమాదమా? నమ్మలేని నిజాన్ని వెల్లడించిన ఫ్రెంచ్ అధ్యయనం..
సాక్షి లైఫ్ : మన ఇళ్లలో నిత్యం ఉపయోగించే గాజు సీసాలు ఆరోగ్యానికి, పర్యావరణానికి సురక్షితమని భావిస్తుంటాం. నీరు, పానీయాలు నిల్వ చేయడానికి ప్లాస్టిక్ కంటే గాజు సీసాలనే ఎక్కువ మంది ఎంచుకుంటారు. కానీ, తాజాగా ఫ్రెంచ్ ఆహార భద్రతా సంస్థ (ఏఎన్ఎస్ఈఎస్) నిర్వహించిన ఓ కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవును, మీరు విన్నది నిజం! గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ షాకింగ్ నిజాలు పరిశోధకులనే ఆశ్చర్యపరిచాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గాజు సీసాలు.. మనం అనుకున్నంత సురక్షితం కాదా?
పర్యావరణానికి మంచివిగా, ఆరోగ్యానికి శ్రేయస్కరంగా భావించి మనం ఇన్నాళ్లూ గాజు సీసాలను వాడాం. వంటగదిలోనూ, ప్రయాణాల్లోనూ వాటిని తీసుకెళ్లాం. కానీ ఏఎన్ఎస్ఈఎస్ వెల్లడించిన ఈ కొత్త పరిశోధన ఫలితాలు మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం, మనకు ఇష్టమైన గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలతో కలుషితమవుతున్నాయట. వివరాల్లోకి వెళ్తే..
అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ ఫలితాలు..
పరిశోధకులు తమ ప్రారంభ ఫలితాలను చూసినప్పుడు వారే నమ్మలేకపోయారు. గాజు సీసాలు ప్లాస్టిక్ కంటే శుభ్రంగా ఉంటాయని వారు ఊహించారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది! శీతల పానీయాలు, నిమ్మరసం, ఐస్ టీ, బీర్ వంటి పానీయాలు నిల్వ చేసిన గాజు సీసాలలో లీటరుకు సగటున 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సంఖ్య ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లలో కనిపించే కణాల కంటే ఏకంగా 50 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
మూతలే..?
ఈ కలుషితానికి ప్రధాన కారణం సీసాల మూతలే కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సీసాలలో లభించిన చాలా ప్లాస్టిక్ కణాల రంగు, ఆకృతి మూత వెలుపల ఉండే పెయింట్‌తో సరిపోలాయి. దీని బట్టి, గాజు సీసాలకు ఉండే మెటల్ మూతల వెలుపలి పెయింట్ నుంచే ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు పానీయాల్లోకి చేరిపోతున్నాయని అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
