సాక్షి లైఫ్ : దృష్టి లోపంతో బాధపడేవారికి శుభవార్త..! అందించారు పరిశోధకులు. శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన ఒక అద్భుతమైన పురోగతి కారణంగా, పూర్తిగా కంటి చూపు కోల్పోయినవారు కూడా పాక్షికంగా తమ దృష్టిని తిరిగి పొందే అవకాశం లభించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంటిలో అమర్చే (Implant) ఒక చిన్న వైర్‌లెస్ చిప్ (Wireless Chip) సాయంతో దృష్టిని పాక్షికంగా పునరుద్ధరించడంలో శాస్త్రవేత్తలు సఫలీకృతం అయ్యారు.
ఇది కూడా చదవండి.. లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం..
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది..?
ముఖ్యంగా వయస్సు మీద పడటం వల్ల వచ్చే వ్యాధులు (Age-Related Macular Degeneration - AMD) లేదా రేటినల్ డిజనరేషన్ (Retinal Degeneration) కారణంగా కేంద్ర దృష్టిని కోల్పోయిన రోగుల కోసం ఈ చిప్‌ను రూపొందించారు.
చిప్ ఏవిధంగా పనిచేస్తుంది అంటే..?
ఈ ఆవిష్కరణ పేరు 'ప్రైమా' (PRIMA). ఇది ఒక అత్యాధునిక కృత్రిమ రెటీనా (Artificial Retina) వ్యవస్థ. ఇది కేవలం 2 మిల్లీమీటర్ల చదరపు పరిమాణంలో, 30 మైక్రాన్ల మందం అంటే బియ్యం గింజ కంటే చిన్నగా ఉంటుంది. ఈ వైర్‌లెస్ మైక్రో చిప్‌ను కంటిలోని దెబ్బతిన్న రెటీనా పొర కింద శస్త్రచికిత్స ద్వారా అమరుస్తారు.
రోగి ఒక ప్రత్యేకమైన అద్దాలు (Augmented Reality Glasses) ధరించాలి. ఈ అద్దాలలో అమర్చిన కెమెరా పరిసరాల దృశ్యాలను బంధిస్తాయి. అద్దాలు బంధించిన దృశ్యాలను ఇన్‌ఫ్రారెడ్ కాంతి (Infrared Light) రూపంలో చిప్‌పైకి ప్రొజెక్ట్ చేస్తాయి. చిప్‌లోని 378 సూక్ష్మ ఎలక్ట్రోడ్‌లు ఈ కాంతిని గ్రహించి, వాటిని విద్యుత్ సంకేతాలుగా మార్చుతాయి.
ఈ విద్యుత్ సంకేతాలు దెబ్బతినకుండా ఉన్న ఆప్టిక్ నరం (Optic Nerve) ద్వారా మెదడుకు చేరుతాయి. అప్పుడు మెదడు ఆ సంకేతాలను అక్కడి దృశ్యాలను కంటితో చూసేందుకు సహకరిస్తాయి.
ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న అంధులు చాలా ఆశాజనకమైన ఫలితాలు పొందేందుకు అవకాశం లభించింది. చిప్ అమర్చిన తరువాత, రోగులు కేవలం ఆకృతులను (Shapes) చూడగలిగే స్థితి నుంచి, అక్షరాలను చదవగలిగే (Read Letters) స్థాయికి, ముఖాలను గుర్తించ గలుగుతున్నారని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా తమ హాబీలు గార్డెనింగ్, పెయింటింగ్ వంటివి తిరిగి ప్రారంభించగలిగామని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిప్ సాంకేతికత.. కోల్పోయిన దృష్టిని పూర్తిగా పునరుద్ధరించకపోయినా, రోగులు తమ రోజువారీ పనులు చేసుకోగలిగేలా పాక్షికంగా కంటి చూపును అందించడం వైద్యరంగంలో ఒక విప్లవాత్మక అడుగుగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com