Latest studies : ప్రకృతి 'నేచర్ పిల్'తో.. ఆందోళన, డిప్రెషన్‌కు చెక్..!

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో మనమంతా బిజీబిజీగా మారి, తెలియకుండానే ఎన్నో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety) మనల్ని వెంటాడుతున్నాయి. అయితే, దీనికి పెద్దగా ఖర్చు లేని, ఎంతో ప్రభావవంతమైన ఒక పరిష్కారం ఉంది! అదేంటంటే... రోజూ కేవలం 20 నిమిషాలు ప్రకృతితో మమేకం అవ్వడం. ప్రకృతిలో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు గుండెపోటుకు లింక్ ఏంటి..?

 

నిపుణులు దీనిని 'నేచర్ పిల్' (Nature Pill) అని కూడా పిలుస్తున్నారు. పార్కులు, తోటలు, పచ్చని ప్రదేశాలలో కొద్దిసేపు గడపడం లేదా నడవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఒత్తిడి హార్మోన్ తగ్గుతుంది(Reduces stress hormone).. 

కేవలం 20 నిమిషాలు ప్రకృతిలో గడిపితే, శరీరంలో కార్టిసాల్ (Cortisol) అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కార్టిసాల్ (Cortisol) తగ్గడం వల్ల హై-బ్లడ్ ప్రెషర్, ఆందోళన వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.

మానసిక ప్రశాంతత.. చెట్ల ఆకుల శబ్దం, పక్షుల గానం, ప్రశాంతమైన వాతావరణం... ఇవన్నీ మన మనసుకు విశ్రాంతినిస్తాయి. ఇది డిప్రెషన్ (Depression) లక్షణాలను తగ్గించి, మానసిక స్థితిని (Mood) మెరుగుపరుస్తుంది. మనస్సు తేలికపడి, సంతోషంగా అనిపిస్తుంది.

అంతేకాదు ఏకాగ్రత పెరుగుతుంది.. ప్రకృతిలో నడవడం వల్ల మెదడుకు తాత్కాలిక విశ్రాంతి లభిస్తుంది. దీనిని 'సాఫ్ట్ ఫాసినేషన్' (soft fascination) అంటారు. ఫలితంగా, పనిపై దృష్టి సారించే సామర్థ్యం (Focus) ఆలోచనల విషయంలో స్పష్టత (Clarity) పెరుగుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు.. ప్రకృతిలో వాకింగ్ చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తపోటు (Blood Pressure) నియంత్రణలో ఉండి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

 పాటించాల్సిన చిన్న చిట్కాలు..  

రోజులో వీలైనంత త్వరగా, ఉదయం వేళల్లో 20 నుంచి 30 నిమిషాలు పార్కులో లేదా పచ్చని ప్రదేశంలో నడవడం లేదా కూర్చోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు.

ఈ సమయంలో ఫోన్, ఇంటర్నెట్ వంటి వాటికి దూరంగా ఉండండి. ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించండి. వారం మొత్తంలో కనీసం మూడు సార్లైనా ఇలా చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఏమాత్రం ఖర్చు లేకుండా, ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ 'నేచర్ పిల్' ను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి. 20 నిమిషాల పాటు ప్రతిరోజూ ప్రకృతి లో గడపడం వల్ల మరింత ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. 

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : stress anxiety-effect stress-mind anxiety stress-management depression-and-anxiety how-to-treat-depression-and-anxiety how-to-reduce-stress-and-anxiety reduce-anxiety anxiety-in-menopause causes-of-morning-anxiety anxiety-relief saffron-tea-for-anxiety houseplants-for-anxiety
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com