న్యూ స్టడీ : గర్భిణీ స్త్రీలపై వాయు కాలుష్యం ప్రభావం ఎలా ఉంటుంది..?  

సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. గర్భిణీ స్త్రీలపై కాలుష్య ప్రభావం ఎలా ఉంటుంది..? అనేదానిపై పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఇందులో వెల్లడైన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 కాలుష్యానికి గురికావడం వల్ల గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రాభవం ఉంటుందని పరిశోధనలో తేలింది. దీని కారణంగా పిల్లలు నెలలు నిండక ముందే పుట్టడం, లేదా తక్కువ బరువు కలిగి ఉండడం జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్‌ ను న్యాచురల్ గా ఎలా తగ్గించవచ్చు..?

ఇది కూడా చదవండి..మూర్ఛలకు ప్రధాన కారణాలు..? 

 

ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి అడపా దడపా ఉపవాసం ఆరోగ్యకరమైనదేనా..? 

 

కాలుష్యానికి గురికావడం వల్ల.. 


 దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి నిరంతరం పెరుగుతోంది. ఢిల్లీతో పాటు దేశంలోని అనేక నగరాల్లో కాలుష్య బీభత్సం కనిపిస్తోంది. ఈ పరిస్థితి తల్లులు కావాలని కలలుకంటున్న మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది. కాలుష్యానికి గురికావడం వల్ల గర్భిణీ స్త్రీలలో మంట స్థాయి పెరుగుతుందని, ఇది పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఒక అధ్యయనం కనుగొంది. తక్కువ జనన బరువు మరియు నెలలు నిండకుండానే పుట్టడం వంటివి ఇందులో ఉన్నాయి.
పరిశోధనలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. 


సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనలు జీవసంబంధ మార్గాలపై కొత్త అవగాహనను అందిస్తాయని పరిశోధకులు అంటున్నారు. దీని ద్వారా, గాలిలో ఉన్న కాలుష్యం మొత్తం గర్భంతోపాటు పుట్టబోయే బిడ్డపైనా, ప్రసవ అనంతరం ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 కాలుష్యం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉన్న కణాల వల్ల కలుగుతుంది. 

హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూఎస్ నేతృత్వంలోని ఒక పరిశోధనలో పీఎం2.5కి గురికావడం గర్భిణీ స్త్రీల హిస్టోన్‌లను ప్రభావితం చేస్తుందని తేలింది. హిస్టోన్‌లు క్రోమోజోమ్‌లలో కనిపించే ప్రోటీన్లు, ఇవి డీఎన్ఏ నిర్మాణం, కణాల పనితీరుకు ముఖ్యమైనవి.

 
 వాయు కాలుష్యం సైటోకిన్ జన్యువుల సాధారణ బ్యాలెన్స్‌కు అంతరాయం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రోగనిరోధక ప్రతిస్పందనలను ఉత్పత్తి చేయడంలో పాల్గొన్న జన్యువులు వాపు, మంటను పెంచుతాయని పరిశోధకులు తెలిపారు. గర్భిణీ స్త్రీలలో, పెరిగిన వాపు ప్రతికూల గర్భధారణ ఫలితాలకు సంబంధించినదని పరిశోధకులు అంటున్నారు.


నిపుణులు.. 

హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో రీసెర్చ్ ఫెలోగా ఉన్న సహ రచయిత యూన్ సూ జంగ్ మాట్లాడుతూ.. "శిశువు ఆరోగ్యాన్ని రక్షించడానికి, గర్భిణీ స్త్రీలు వాయు కాలుష్యానికి గురికాకుండా ఉండడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు." గర్భిణీ స్త్రీలను కాలుష్యానికి గురికాకుండా రక్షించడానికి గాలి నాణ్యత , క్లినికల్ మార్గదర్శకాలను మెరుగుపరచాలని తద్వారా ఆయా సమస్యలను కొంతమేర తగ్గించవచ్చని చెప్పారు.

 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి.. 

ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : women-health air-pollution airpollution polycystic-ovary-disorder pregnancy-time spondylosis pregnancy pregnant-women pregnant-women-health pollution-effect pollution delhi-pollution eclipse-and-pregnant-women sound-pollution
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com