భారతదేశంలో అవయవదానం చేయడానికి రూల్స్.. ఇవే.. 

సాక్షి లైఫ్ : అవయవదానం విషయంలో ఒక్కో దేశం ఒక్కో విధానాలను, నియమ, నిబంధనలను అమలు చేస్తున్నారు. భారతదేశంలో తండ్రి, తల్లి, భార్య, తోబుట్టువులు, పిల్లలు, భర్త, మనుమలు, అత్తమామలు లేదా బంధువులు కాని వారి దగ్గరి బంధువుల నుంచి మాత్రమే అవయవ దానం ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆక్ట్ (THOA చట్టం 2014) చట్ట ప్రకారం అనుమతిస్తున్నారు.  

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఆమోదం అవసరం.. 

సంబంధం లేనివారి నుంచి స్వీకరించే అవయవ దానానికి ప్రభుత్వ ఆథరైజేషన్ కమిటీ ఆమోదం అవసరం. ఎయిడ్స్, హెపటైటిస్ "బి" , క్యాన్సర్ లేని వారైతే 1 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా అవయవ దానం చేయవచ్చు.

సాధారణ మరణాలలో హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోయి అవయవాలు పనికిరాకుండా పోతాయి. బ్రెయిన్ డేట్ సంభవించినప్పుడు రోగి వైద్యపరంగా చనిపోయినప్పటికీ ఆధునిక పరికరాల సహాయంతో అవయవాలకు రక్త ప్రసరణ, హృదయ స్పందన నిర్వహించి ఆ తరువాత అవయవాలను ఉపయోగిస్తారు.

సమగ్ర అవయవ దానం చట్టం.. 

1994లో భారతదేశంలో సమగ్ర అవయవ దానం చట్టం (THOA చట్టం-ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ & టిష్యూ యాక్ట్) అమలులోకి వచ్చింది. THOA చట్టం 2011లో సవరించారు. అయితే ఇది 2014లో అమలులోకి వచ్చింది. బ్రెయిన్ డెత్ , అవయవ అక్రమ రవాణాపై కఠినంగా, శాస్త్రీయంగా, సామాజిక బాధ్యతతో ఈ చట్టం అమలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : brain-health heart-attack heart-problems heart-failure brain-stroke world-health-organization world-health-organization-statistics second-largest-organ organ world-organ-donation-day-2024 organ-donation organ-donation-awareness organ-donation-campaign organ-donation-impact organ-donation-matters world-organ-donation-day thota-act transplantation-of-human-organs-and-tissues-act-1994

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com